Modernas Covid jab and mRNA vaccine safe for use in children చిన్నారుల;కవచంలా నిలవనున్న మోడర్నా, ఎంఆర్ఎన్ఏ వాక్సీన్లు

Modernas covid jab and mrna vaccine safe for use in children says university study

corona vaccine, covaxin trials, moderna, mRNA vaccine, Covid-19, baby rhesus macaques, University of North Carolina (UNC), journal Science Immunology, Children, Clinical Trails, Covaxin Clinical Trials, Children volenteers, New Delhi

Moderna's mRNA COVID vaccine and a protein-based shot is safe for use in young children and offers strong immunity response, with no adverse effects, according to a research on baby rhesus macaques.

చిన్నారుల శుభవార్త: రక్షణ కవచంలా నిలవనున్న మోడర్నా, ఎంఆర్ఎన్ఏ వాక్సీన్లు

Posted: 06/17/2021 01:25 PM IST
Modernas covid jab and mrna vaccine safe for use in children says university study

కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపైనే అధిక ప్రభావం చూపుతుందనే ఆందోళనల నేపథ్యంలో నిపుణులు చిన్నారులపై కూడా వ్యాక్సిన్స్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది చిన్నారులను ఎంపిక చేసి వారిపై ట్రయల్స్ నిర్వహించారు, ఈ క్రమంలో యంగ్ చిల్డ్రన్స్ కు ఇచ్చిన రెండు డోసుల వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేశాయని శుభవార్త తెలిసింది. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావాన్ని చాటుతుందన్న వార్తలు నిజమే అయినా.. మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవచ్చే భరోసా వచ్చింది. దీంతో పిల్లలకు టీకా సురక్షితమైనవిగా తేలింది.

ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించారు. దీని ప్రకారం చిన్నారులలో రెండు డోసులు వ్యాక్సిన్లతో యాంటీబాడీలు అద్భుతంగా పెరిగాయని సైంటిస్టులు వెల్లడించారు. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత ప్రయోగాత్మక టీకాలు పిల్లలకు.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధన తేలింది. కరోనా వైరస్ వ్యాప్తిని చిన్నారులలో నివారించడానికి ఈ రెండు వాక్సీన్లు వేయడం అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో చిన్నారులను కరోనా నుంచి సంరక్షించుకోవచ్చునని అన్నారు.

కోతి జాతికి చెందిన రీసస్‌ మకాక్‌ (ఆఫ్రికన్ లాంగూర్‌) పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీల్లో చక్కటి మార్పులు వచ్చి ప్రతిస్పందిస్తున్నట్లుగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ల ప్రయోగాలు 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు చేశామని ఈ విషయంలో మరింతగా అర్థం చేసుకోవడానికి మరో సంవత్సరం పాటు ప్రయోగాలు కొనసాగిస్తామని తెలిపారు. రెండున్నర నెలల వయసున్న కోతి పిల్లలను రెండు విభాగాలుగా చేసి వాటికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. ఆ తరువాత ఆ రెండు గ్రూపుల కోతిపిల్లలను నాలుగు వారాల తరువాత పరిశీలించగా.. వాటిలో రోగనిరోధక శక్తి చక్కగా పెరిగిందని పరిశోధకులు తెలిపారు.

ప్రతి జంతువుకు ప్రీక్లినికల్​​ మోడెర్నా, ఎంఆర్‌ఎన్‌ఏ టీకా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్​ ఆఫ్​ అలెర్జీ అండ్​ ఇన్ఫెక్షియస్​ డిసీజెస్​ (ఎన్​ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇచ్చారు. ఎంఆర్‌ఎన్‌ఏ టీకా వైరస్ ఉపరితల ప్రోటీన్, స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి చక్కటి ఇష్ట్రక్షన్స్ అందిస్తోందని వెల్లడించారు. దీంతో రోగనిరోధక కణాలు ప్రోటీన్ ను గుర్తించి యాంటీబాడీలను అభివృద్ధి చేస్తాయి. ఎన్ఐఎఐడి టీకాలోని స్పైక్​ ప్రోటీన్​ ఉంటుంది. దాన్ని రోగనిరోధక వ్యవస్థ గుర్తించి అదే పరిమాణంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి అవుతాయని పరిశోధకులు తెలిపారు. అయితే వ్యాక్సిన్లు.. టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదని, ఇది పిల్లల్లో భద్రతకు హాని కలిగిస్తుందని.. అలాగే యాంటీబాడీలు ఎదుర్కొని.. చిన్నపిల్లల్లో టీకా అభివృద్ధికి ఆటంకం కలిస్తాయి.

కాబట్టి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇచ్చినట్లయితే.. శక్తిమంతమైన ప్రతిరోధకాల వయోజనుల్లో పెరిగిన స్థాయితో పోల్చవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైన అమెరికాలోని నార్త్​ కరోలినా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ క్రిస్టినా డి పారిస్​ తెలిపారు. మోడెర్నా టీకాతో, నిర్దిష్ట బలమైన టీ-కణాలు ప్రతిస్పందిస్తాయని.. ఇవి వ్యాధి తీవ్రతను ముఖ్యమైనవని ఆయన పేర్కొన్నారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలు.. పిల్లల్లో కరోనా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలకు సంబంధించిన వివరాలను చక్కగా వివరించారు. ఏది ఏమైనా థర్డ్ వేవ్ నుంచి చిన్నారులను రక్షించుకోవాలని పరిశోధకులు చెప్పిన వివరాలను బట్టి ఇది చాలా మంచి శుభపరిణామం అని అనుకోవచ్చు. పిల్లలను కాపాడుకోగలం అనే భరోసాలను ఇచ్చాయి ఈ పరిశోధనలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh