Tears from Sri Rama Idol in Khammam ఖమ్మం జిల్లాల్లో కన్నీరు పెడుతున్న శ్రీరాముడి విగ్రహం

Tears rolling out from sri rama idol in karepally mandal of khammam

Tears rolling out from Sri Rama Idol, Tears from Sri Rama Idol, Tears from Sri Rama Idol in Venkatayi Thanda, Tears from Sri Rama Idol in Karepally mandal, Tears from Sri Rama Idol in Khammam dist, Tears from Sri Rama Idol in Telangana, Tears, khammam Sri Rama Idol, Sri Rama Idol, devotees, Venkatayi Thanda, Karepally Mandal, Khammam district, Telangana, Politics

Tears rolling out from Sri Rama Idol in Telangana makes devotees worry. In Venkatayi Thanda of Karepally mandal in Khammam district of Telangana this incident had taken place, Which also draws local people attention and comming out for visit to this temple.

ITEMVIDEOS: ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కన్నీరు పెడుతున్న శ్రీరాముడి విగ్రహం

Posted: 06/17/2021 09:31 AM IST
Tears rolling out from sri rama idol in karepally mandal of khammam

భద్రాధి రాముడి కోసం భక్తరామదాసు కట్టించిన శ్రీరామాలయం నెలకొన్న ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. అదే జిల్లాకు చెందిన ఓ తాండలో శ్రీరాముల వారి విగ్రహం కన్నీరు కారుస్తోంది. లోక కల్యాణ కారకుడైన రాముడి కంట కన్నీరు కారుతుండటంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. రాములోరి విగ్రహం నుంచి కన్నీరు కారడాన్ని కొందరు వింతగా అభివర్ణించగా, మరికొందరు ఇది అశుభ పరిణామామంగా పేర్కోనగా.. ఇంకోందరు స్వయంగా దేవుతామూర్తి విగ్రహం నుంచి నీరు కారడం అరిష్టమని అంటున్నారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని వెంకటయి తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటయి తండాలోని సమ్మక సారలక్క ఆలయంలో శ్రీరాములవారి విగ్రహం ఎడమ కంటి నుంచి నీళ్లు కారుతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇరుగుపోరుగు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి బారులు తీశారు. కొందరు శ్రీరాముడి కంట కన్నీరా? అంటూ భక్తిభావనతో ఆలయానికి రాగా, మరికోందరు ఇదెక్కడి వింత అంటూ ఆశ్చర్యంతో చూడటానికి క్యూ కట్టారు. ఇక ఈ సందర్భంలో నిజానిజాలను పక్కనబెట్టిన కొందరు పుకార్లకు పనికల్పించారు.

మానవ జాతికి రాబోతున్న అపదకు సంకేతమని కొందరు అంటే.. ప్రస్తుతమున్న కరోనా వైపరిత్యాల నేపథ్యంలో తన భక్త జనకోటికి వచ్చిన కష్టం నేపథ్యంలో శ్రీరాములవారు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ రకరకాలుగా చెబుతున్నారు. ఐదేళ్లుగా రాముడికి కళ్యాణం జరిపిస్తున్నారు గ్రామస్తులు. అయితే, తన కలలో శ్రీరాముడు కనిపించి, కన్నీరు పెట్టుకున్నారని, ఆలయానికి వచ్చి చూడగా, అది నిజంగానే జరిగిందని, ఆలయ పూజారి చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. కాగా, గత 50ఏళ్లుగా ఇలా ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. తమ గ్రామానికి ఎలాంటి అరిష్టం జరగకుండా రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించే పనిలో పడ్డారు ఆలయ నిర్వాహకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles