son replaces bull to cultivate land in Adilabad కన్న కొడుకే కాడెద్దు.. కదిలించే ఘటన.. ఎమ్మెల్యే సాయం..

Son replaces bull to cultivate land in indravelli mandal of adilabad

Son Replaces Bull to Plough farm land, Son Replaces Bull in Indravelli mandal, Son Replaces Bull in Adilabad, Son Replaces Bull in Telangana, Farmer, Son, Bull, dongragoan, Indravelli, Khanapur MLA, Rekha Naik, Rs.20 thousand, Adilabad, Telangana

A son replaces bull to make his father cultivate his agriculture land in dongragoan village of indravelli mandal in Adilabad district of Telangana. This incident came to the notice of MLA Rekha Naik, who is undergoing quarantine, helps the farmer with Rs 20 thousand to buy another bull.

కన్న కొడుకే కాడెద్దై దుక్కిదున్నిగా.. కదిలించే ఘటన.. ఎమ్మెల్యే సాయం..

Posted: 06/16/2021 03:14 PM IST
Son replaces bull to cultivate land in indravelli mandal of adilabad

కన్న బిడ్డను కాడెద్దుగా మార్చిన ఓ రైతు.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలాన్ని చదను చేశాడు. తండ్రి అరకు పట్టి.. చేను దున్నుతుంటే.. ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు ముందుకు కదిలాడు. వానలు కురుస్తున్న వేళ.. తాను వెనుకబడి పోతానన్న దిగులు.. జోడెడ్లలో ఒకటి ఇటీవలే మరణించిందన్న అవేదన.. అతనిలో నైరాశ్యాన్ని నింపగా.. తాను కాడెద్దునై ముందుకు సాగుతానన్న భరోసా ఇచ్చిన తనయుడు సాగులో సహకరించి…తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. నేలతల్లిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా..కాడిని వదలరని ఈ దృశ్యమే నిదర్శనం.

రైతు అంటేనే చిన్నచూపు.. వ్యవసాయం అంటేనే అర్థం తెలియని వాళ్లు ఇప్పటికీ మనీ కోసం వెంపర్లాడుతూ సోకాల్డ్ హైఫై జీవితాలను గడిపేస్తూ వుంటారు. అయితే రైతు వ్యవసాయాన్ని నమ్మినంతగా దేనినీ నమ్మడని.. అవసరమైతే తన సంతానాన్నే కాడెద్దుగా మార్చి వ్యవసాయం చేస్తాడని, మానవజాతికి అన్నం పెడతాడని మరోమారు రుజువు చేసింది ఈ ఘటన. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్ గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్నాడు. తొలకరి పలకరించడం..వర్షాలు పడడంతో పొలం పండించేందుకు సిద్ధమయ్యాడు. ఇతనికి ఆరు ఎకరాల పొలం ఉంది.

అయితే..అతనికున్న రెండు కాడెద్దుల్లో ఒక ఎద్దు అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో ఆ రైతు తీవ్ర ఆందోళన చెందాడు. మరో ఎద్దు కొనాలంటే..ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏమి చేయాలో పాలుపాలేదు. పత్తి విత్తనాలు వేయకపోతే..వెనుకబడి పోతానని గ్రహించాడు. కొడుకు సాయినాథ్ తండ్రి ఆందోళనను గ్రహించాడు. తాను కాడిని దున్నుతానని చెప్పాడు. అయితే..చదువుకోవాల్సిన సమయంలో..ఇలాంటివి ఎందుకని తండ్రి గ్రహించాడు. కానీ.. చివరకు కొడుకు చేసిన ప్రతిపాదనకు ఒకే చెప్పాడు. ఒక వైపు ఎద్దు ..మరోవైపు..కొడుకుతో పొలం దున్నాడు. ఈ విషయం తెలిసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నా.. వారికి రూ. 20 వేలు సాయంగా అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmer  Son  Bull  dongragoan  Indravelli  Khanapur MLA  Rekha Naik  Rs.20 thousand  Adilabad  Telangana  

Other Articles