Bull steps three-storey house in Madhya pradesh మూడంతస్థులు ఎక్కిన ఎద్దు.. మంచంపై సేద తీరింది.!

Madhya pradesh bull resting in upper room of three storey house

Bull resting in upper room, Bull resting in top room, Bull enters three stored building, Bull rests in third floor, Bull rests on floor, Bull enters home in Rewa, Bull enters home in madhya pradesh, BULL, Three Storey building, rests on bed, sacred animal, Rewa, Madhya Pradesh, Viral News, Viral Video, Video viral

The case that was surprised in Rewa of Madhya Pradesh has emerged. Here a bull entered three-storey house. The special thing was that these bulls reached the top room. When the members of the house reached there, it was surprised to see this view. The sacred was relaxed on the bed. He had dung only on the bed.

మూడంతస్థులు ఎక్కిన ఎద్దు.. మంచంపై సేద తీరింది.!

Posted: 06/17/2021 10:28 AM IST
Madhya pradesh bull resting in upper room of three storey house

ఇళ్లలోకి పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు రావడం,.. అవి కూడా మనతో పాటు సోఫాలపై కూర్చోవడం, మంచాలపై పడుకోవడం సర్వసాధారణమే. అయితే సాధు జంతువులైన ఆవులు, ఎద్దులు, గేదలు, మేకలు ఇతరాత్ర జంతుజాలం మాత్రం ఇంట్లోకి రాకుండా పెరిటి వరకు మాత్రమే పరిమితం అవుతుంటాయి. ఎప్పుడు మనుషులు తమ సోఫాలు, మంచాలపై కుక్కలకు, పిల్లులకు మాత్రమే స్థానం కల్పిస్తారెందుకు..? నేను మాత్రం ఏం తక్కువ అనుకుందో ఏమే తెలియదు కానీ ఓ ఎద్దు (వృషభం) ఏకంగా మూడంతస్థుల భవనంలోకి చోచ్చకోచ్చి.. మూడవ అంతస్థులోని బెడ్ రూములో అక్కడున్న మంచంపై హాయిగా సేదతీరింది.

మధ్యప్రదేశ్ లోని రేవాలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ భారీ ఎద్దు తమ ఇంట్లోకి ప్రవేశించి ఏకంగా మూడు అంతస్థులు మెట్లు ఎక్కి.. అక్కడున్న బెడ్ రూమ్ లోని మంచంపై సేద తీరడంతో ఆ ఇంట్లోనివాళ్లు హడలిపోయారు. మూడు ఫ్లోర్లు ఎక్కి అలసిపోయి బెడ్ రూమ్ లో మంచంపై సేద తీరిందో లేక తాను శునకంలాగే ఎక్కగలిగాను అని నిరూపించడానికి చేసిందో కానీ ఎద్దును చూడగానే ఇంట్లోనివారు భయపడిపోయారు. ఇంట్లోని వారంతా టీవీ చూస్తూ బిజీగా ఉండగా, అదే అదనుగా భావించిన ఎద్దు ఏకంగా బెడ్ రూమ్ లోని మంచంపైకి ఎక్కి మరీ సేద తీరింది.

ఎద్దు మూడు అంతస్థులను ఇరుకైన మెట్లమీద నుంచి ఎక్కుతున్నా దానిని ఎవ్వరూ గమనించిలేదు.. ఆ ఫ్లోర్ లో ఉన్న బెడ్ రూమ్ లో బెడ్ పై హాయిగా పడుకుంది. అక్కడ ఉన్న అద్దంలో చూస్తూ నెమరు వేసుకుంటూ కాసేపు కునుకు తీసింది. కొద్దీ సేపటి తర్వాత దానిని గమనించిన ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. ఇక దానిని గమించిన తరువాత దానిని బయటకు తరిమేందుకు ఇంట్లోని వారికి ధైర్యం సరిపోలేదు. అసలు దాని ఎదుటకు వెళ్లేందుకే వారు జంకుతిన్నారు. పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత చివరకు నెమ్మదిగా కిందకు దించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles