ED Summons TRS MP Nama Nageswara Rao ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలి..

Bank fraud case ed summons trs mp nama nageswara rao

ED Summons TRS MP Nama Nageswara Rao, TRS MP Nama Nageswara Rao, Bank Fraud case, bank fund scam, Enforcement Directorate, Madhucon Company, diverting funds, foreign companies, Ranchi Expressway Limited, Telangana, Crime

Officials of the Enforcement Directorate (ED) have issued summons to TRS MP Nama Nageswara Rao and three directors of Madhucon Group of companies in a money laundering case and asked them to appear before them on June 25 for investigation.

ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలి..

Posted: 06/16/2021 02:20 PM IST
Bank fraud case ed summons trs mp nama nageswara rao

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. పలు బ్యాంకుల నుంచి ప్రజాధనాన్ని రుణాలుగా పోందిన ఆయన వాటిని తిరిగి చెల్లించడంలో విఫలం అయ్యారు. బ్యాంకులకు మరో ఎగవేతదారుగా మారిని నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా నామాకు అందజేసిన సమన్లలో పేర్కోన్నారు. బ్యాంకు రుణాలను అక్రమంగా విదేశీ కంపెనీలకు మళ్లించారనే అభియోగాలపై నామాకు ఈడీ సమన్లు పంపింది. మదుకాన్ కేసులో నామా నాగేశ్వరరావుతో పాటు నిందితులందరికి సమన్లు జారీచేసింది.

ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్‌ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత వారంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆ తరువాత మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవలే రెండు రోజుల పాటు సోదాలు జరిగాయి. ఈడీ సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే అకౌంట్లు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.

బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధుకాన్ కేసులో ఉన్న నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. మూడు రోజుల క్రితమే నామా నివాసాలు, ఆఫీస్, మధుకాన్ కాంపెనీ, డైరెక్టర్ల ఇళ్లల్లో 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలు, కీలక డాక్యమెంట్లకు సంబంధించి కీలక ఆధారాలను ఈడీ సేకరించింది. నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు అనంతరం విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles