Man shoots dead relative over property dispute in Kadapa ధాయాధుల మధ్య ఆస్తిపోరు.. కడపలో కాల్పుల కలకలం..

Ysrc leader shoots dead relative over property row in kadapa ends life

firing in pulivendula, shooting in pulivendula, firing in kadapa, shooting in kadapa, firing in Andhra pradesh, shooting in Andhra pradesh, parthasaradhi reddy, siva prasad reddy, Pulivendula, Kadapa, property dispute, Andhra Pradesh, politics, crime

A man shot his relative over a property dispute in Andhra Pradesh chief minister YS Jaganmohan Reddy's home constituency Pulivendula in Kadapa district on Tuesday. He then committed suicide by shooting himself. The deceased have been identified as Parthasaradhi Reddy(48) and Prasad Reddy(62).

ధాయాధుల మధ్య ఆస్తిపోరు.. కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

Posted: 06/15/2021 12:26 PM IST
Ysrc leader shoots dead relative over property row in kadapa ends life

కడప జిల్లా పులివెందులలో ఇద్దరు దాయాదుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారితీసింది. మండలంలోని నల్లపురెడ్డి పల్లిలో దాయాదుల మధ్య రేగిన ఆస్తి వివాదం నేపథ్యంలో ఒకరిని మరోకరు తుపాకీతో కాల్చి చంపి.. క్షణికావేశంలో చేసిన తప్పును తెలుసుకుని తననుతాను కాల్చుకొని మరణించిన ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో రేగిన వివాదమని కొందురు అంటుండగా, మరికోందరు పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు. అయితే భార్యభర్తల పంచాయితీలో భార్యకు అనుకూలంగా తీర్పును వెలువరించినారని భర్త పగబట్టి హతమార్చేందుకు యత్నించగా తప్పనిసరి పరిస్థితుల మధ్య గత్యంతరం లేక తనను తాను రక్షించుకునే క్రమంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.

పార్థసారధి రెడ్డి అనే వ్యక్తిని గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి కాల్చిచంపాడు. హతులు ఇద్దరూ దాయాదులు అవుతారు. గ్రామంలో ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో పార్ధసారధి రెడ్డి కత్తితో ప్రసాద రెడ్డిపై దాడికి చేసేందుకు యత్నిస్తుండగా… ప్రసాద రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్‌ పోందిన రివాల్వర్ తో పార్ధసారధి రెడ్డిపై కాల్పులు జరిపాడు. పార్ధసారధి రెడ్డి శరీరంలోకి రెండు బుల్లెట్లు తగిలాయి. మూడో బుల్లెట్ లోడ్ చేసే లోగానే పార్ధసారధి రెడ్డి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకోని చనిపోయాడు.

మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి ప్రసాదరెడ్డి గ్రామపెద్దగా వ్యవహరిస్తూ చిన్న చిన్న సమస్యలకు, తగాదాలకు అక్కడే పరిష్కారం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో పంచాయతీలు చేస్తూ గ్రామపెద్దగా పేరు పొందిన ఆయన గతంలో భార్యభర్తల సమస్యలతో తన వద్దకు వచ్చిన శివప్రసాద్ రెడ్డిని మందలించి బుద్ది చెప్పాడు. దానిని జీర్ణం చేసుకోలేని పార్థసారధీ రెడ్డి ఇవాళ ఉదయం కత్తి చేత పట్టుకుని దాయాధి శివప్రసాద్ రెడ్డిపై దాడికి యత్నించగా, ఆయన తన తుపాకీతో కాల్చిచంపాడు. ఆ తరువాత ఆత్మరక్షణకు ఇలా చేశానని సమర్థించుకోకుండా తన కోపం వల్ల తన దాయాది మరణించాడని కుమిలిపోయాడు.

ఆ వెంటనే తనకు ధాయాధిని కాల్చి చంపాడనే అపవాదు వస్తుందనే అవమాన భారంతో తనను తాను కాల్చుకుని ఆత్నహత్య చేసుకున్నాడు. గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రసాదరెడ్డి, గతంలో పార్ధసారధి రెడ్డి కుటుంబం భార్యా భర్తల విషయంలో పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. ఆ పంచాయతీలో తనకు అన్యాయం జరిగిందని భావించిన పార్ధసారధి రెడ్డి, శివప్రసాదరెడ్డిపై కక్ష పెంచుకుని ఈరోజు ఉదయం దాడిచేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తనను తాను రక్షించుకోటానికే శివప్రసాద రెడ్డి కాల్పులు జరిపినట్లు ప్రాధమికంగా సమాచారం అందుతోంది. పోలీసులు గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి శాంతిభద్రతలు పరిరక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles