Telangana Govt to give Lockdown Relaxations ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో మరికొన్ని సడలింపులు.?

Telangana government to give lockdown relaxations from june 20th

Lockdown Relaxations, Night Curfew, State Economy, Bars, Restarents, CM KCR, unlock preparations, cinema halls, Telangana, Crime

Telangana Government to give Lockdown Relaxations from June 20th, and to take measure to boost up the state economy. To Impliment night curfew in the state from night 9pm to 6am.

ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో మరికొన్ని సడలింపులు.?

Posted: 06/15/2021 11:31 AM IST
Telangana government to give lockdown relaxations from june 20th

తెలంగాణలో కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించే యోచనలో వుంది. ఈ నెల 19తో లాక్ డౌన్ పూర్తి కానున్న తరుణంలో రాష్ట్రంలో పగటిపూట ప్రజలకు వెసలుబాటు కల్పించాలని ప్రభుత్వం అలోచిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టిన క్రమంలో అక్కడి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్టుగానే ఇక్కడి కూడా కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పగలు పలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార కేంద్రాలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన. దీంతో గాడి తప్పిన రాష్ట్ర అర్థిక వ్యవస్థను మళ్లీ పుంజుకునేలా చేసేందుకు నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

ఈ నేపథ్యంలో ఈనెల 19 తర్వాత లాక్ డౌన్ ముగిసన తరువాత ఇక లాక్ డౌన్ స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ప్యూను విధించే యోచనలో ప్రభుత్వం వుందని సమాచారం. ఈ క్రమంలో పగటిపూట మాత్రం లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం. వారం పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుందని అధికార వర్గాల ద్వారా అనధికార సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమల్లో ఉంది.

ఇక జులై 1 నుంచి రాష్ట్రంలో పగటి పూట కోవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు నిలిపివేసి.. అన్ లాక్ ఆంక్షలను అమలుపర్చే యోచనలో ప్రభుత్వం వుందని సమాచారం. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 50 శాతం ఆక్యుపెన్సికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్లు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సడలింపులపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల సడలింపు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles