AIIMS Delhi to start screening children for Covaxin trials చిన్నారులకు కోవాగ్జీన్.. ట్రయల్స్ ప్రారంభించిన ఎయిమ్స్

Aiims to begin recruitment for covaxin clinical trials on children aged 6 12

corona vaccine, covaxin trials, AIIMS, Covid-19, Children, Clinical Trails, Covaxin Clinical Trials, Children volenteers, New Delhi

AIIMS or The All India Institute of Medical Sciences Delhi is set to begin the clinical trials recruitment for the children in the 6-12 years age group, according to news agency ANI. It has also reportedly said that clinical trials of children in 2-6 age groups will start once the 6-12 years age group trails begin.

చిన్నారులకు కోవాగ్జీన్.. ట్రయల్స్ ప్రారంభించిన ఎయిమ్స్

Posted: 06/15/2021 01:09 PM IST
Aiims to begin recruitment for covaxin clinical trials on children aged 6 12

కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యలను ఎక్కడికక్కడ తీసుకుంటున్న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ.. తాజాగా చిన్నారులపై కోవాగ్జీన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు సన్నధమైంది. మూడవ దశ కరోనా అత్యంత ప్రమాదకారిగా మారి పిల్లలపై ప్రభావాన్ని చాటుతుందన్న వార్తల నేపథ్యంలో వారికి వాక్సీన్ ట్రయల్స్ ను కొనసాగిస్తుంది ఎయిమ్స్. ఈ తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతకంటే చిన్న వయస్సువారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో ట్రయల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో 12-18 ఏళ్ల మధ్య వారికి ఇదివరకే ట్రయల్స్ ప్రారంభం కాగా, తాజాగా ఇవాళ్లి నుంచి ఆరేళ్ల వయస్సు నుంచి పన్నెండేళ్ల వయసున్న మధ్యనున్న చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ కు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ట్రయల్స్ కోసం 6 నుంచి 12 ఏళ్ల పిల్లలను ఎంపిక ప్రారంభమైంది. బాల వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుందని ఎయిమ్స్‌కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేట్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ ఎంపిక ఇవాళ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

కాగా.. ఎంపిక చేసిన వాలంటీర్లకు వ్యాక్సిన్ వేయటం కూడా పూర్తి అయ్యాక పూర్తిగా వారి అబ్జర్వు చేసిన అనంతం 2 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. మరోవైపు, 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు అనుమతి ఇస్తూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) మే 12న ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేయటానికి 175 మంది చిన్నారులను ఎంపిక చేసి వారిని మూడు గ్రూపులుగా డివైడ్ చేసి.. టీకా పరీక్షలు నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఇచ్చి వేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles