At Least 26 Killed In Lightning In West Bengal పశ్చిమ బెంగాల్ లో పిడుగుల వర్షం.. 26 మంది మృతి

At least 26 killed in lightning strikes in west bengal

26 killed in lightning strikes, lightening strikes in south bengal, lightening strikes in West bengal, disaster management, lightening strikes in murshidabad, lightening strikes in Hooghly, lightening strikes in purba medinipur, 26 killed, Rains, lightning strike, Murshidabad, Hooghly, Purba medinipur, south bengal, West Bengal, crime

At least 26 persons were killed in lightning strikes in three districts of south Bengal, a state disaster management official said. Nine people died each in Murshidabad and Hooghly districts and two their lives in the Purba Medinipur district, the official said.

పశ్చిమ బెంగాల్ లో పిడుగుల వర్షం.. 26 మంది మృతి

Posted: 06/08/2021 09:45 AM IST
At least 26 killed in lightning strikes in west bengal

పశ్చిమ బెంగాల్‌లో భీకరంగా కురిసిన వరుణుడు 26 మందిని బలతీసుకున్నాడు. వర్షానికి తోడు తీవ్రమైన గాలులు దక్షిణ బెంగాల్ లో బీభత్సం సృష్టించాయి. వీటికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బెంగాల్ లోని దక్షిణ బాగంలోని పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. అకస్మాత్తుగా కురిసిన ఈ వానలకు 26 మంది చనిపోయినట్టు రాష్ట్ర విపత్తు నివారణా అధికారులు తెలిపారు. ఇది వరకే యాస్ తుఫాను మిగిల్చిన విషాదాలు, పెను నష్టాలను మర్చిపోని బెంగాల్ వాసులపై మరోమారు వరుణుడు తన ఉగ్రరూపంతో విరుచుకుపడ్డాడు.

హూగ్లీలో ఏకంగా పదకొండు మంది, ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్, బంకురా జిల్లాలో ఇద్దరు చోప్పున పిడుగులు పడి చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ బెంగాల్ లో వర్షాలకు తోడు పిడుగులు పడటంతో ఏకంగా 26 మంది మరణించారు. రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసిందా అన్నట్లుగా విషాదం అలుముకుంది. రాష్ట్రంలోని పూర్బ మెదినిపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్ కత్తా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నాడియా జిల్లాలో పిడుగులు పడ్డాయి.

పశ్చిమ బెంగాల్ లో వర్షాలకు 26 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రళయంలో భాగంగా తమ వారిని కోల్పోయిన కుటుంబసభ్యులకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రాధిస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చోప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి అమిత్ షా కూడా సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 26 killed  Rains  lightning strike  Murshidabad  Hooghly  Purba medinipur  south bengal  West Bengal  crime  

Other Articles