Doctors warn of post-Covid Herpes, hair fall problems కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

Herpes hair fall nail issues doctors caution about post covid dermatological problems

covid recovery, hairfall, herpes, nail issues post covid 19, covid recovery health issues, dermatological issues during covid recovery, skin inflammation during covid recovery, recover health care, skin, low immunity, Indraprastha Apollo Hospitals, dermatological complication, skin inflammation

Skincare experts at leading facilities in Delhi, Mumbai and other cities concurred that coronavirus patients, even after being discharged from hospitals or having finished their home quarantine period, should watch out for any skin inflammation or consult a doctor immediately if "it grows uncontrollably"

కరోనా నుంచి కోలుకున్నా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు

Posted: 06/08/2021 10:35 AM IST
Herpes hair fall nail issues doctors caution about post covid dermatological problems

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తన రూపాన్ని బదలాయిస్తూ ఒకటో దశ, రెండో దశ ప్రభావాలను మార్చుకుంది. ఇక త్వరలో మూడవ దశగా కూడా రూపాన్ని మార్చకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రజలు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇప్పట్నుంచే జాగ్రత్త పడతున్నారు. ఈ క్రమంలో రెండవ దశలో కరోనా బారిన పడిన వారు, కరోనా నుంచి కోలుకున్న వారికి కూడా కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తోందీ మహమ్మారి. దీని నుంచి కోలుకున్న తర్వాత కూడా వివిధ రూపాల్లో వేధిస్తోంది. కరోనా బారి నుంచి కోలుకున్న తర్వాత వేధిస్తున్న పలు సమస్యలలో ఇప్పుడు హెర్పిస్ ఇన్ఫెక్షన్ కూడా చేరింది.

కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఇది తిరగబెడుతోంది. ఫలితంగా జట్టు రాలిపోవడం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు, పెదవి చుట్టూ పొక్కులు వంటివి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినవారు, క్వారంటైన్ లో ఉన్నవారు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ బాధితుల్లో ఎక్కువ మంది హెర్పిస్ ఇన్ఫెక్షన్‌ కు గురవుతున్నారని పేర్కొన్నారు. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వీ) వల్ల హెర్పిస్ లేబియాలిస్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది క్రమంగా హెచ్ఎస్‌వీ-1 లేదంటే హెచ్ఎస్‌వీ-2కు దారితీసే అవకాశం ఉంది.

అదే జరిగితే పెదవి చుట్టూ నీటిపొక్కులు రావడంతోపాటు నొప్పి కూడా ఉంటుంది. కొవిడ్ బాధితుల్లో హెచ్ఎస్‌వీ కంటే హెర్పిస్ జోస్టర్ కేసులే ఎక్కువగా వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారిసెల్లా-జోస్టర్ వైరస్ మళ్లీ యాక్టివేట్ అయి హెర్పిస్ జోస్టర్ అనే ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. ఫలితంగా చర్మంపై చెల్ది పొక్కులు వస్తాయని చెబుతున్నారు. అలాగే, క్యాండిడా ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మర్మాయవవాల వద్ద తెల్లటి పొక్కులు వస్తుంటాయి. గోళ్లపై గోధుమ రంగులో గీతలు రావడం, మహిళల్లో జుట్టు రాలిపోవడం, నుదురు, వీపుపై మచ్చలు రావడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles