కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్టు మోడీ తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి టీకా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుంది. వ్యాక్సిన్ కేంద్రాల నుంచి కేంద్రమే కొని రాష్ట్రాలకు అందిస్తుంది. వ్యాక్సిన్ కోసం ఏ రాష్ట్రం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మోడీ పేర్కొన్నారు. ఉచిత టీకా వద్దనుకుంటే ప్రైవేట్ లో వేయించుకోవచ్చని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రిలు 150 సర్వీస్ ఛార్జీలతో అందిచాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్దృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొనసాగిన వ్యాప్తి కాసింత తగ్గుముఖం పట్టింది. దీంతో తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పేదలకు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు అందిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. నవంబర్ వరకు దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామన్నారు.
అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి 80శాతం మంది ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే వ్యాక్సినేషన్, అదేవిధంగా థర్డ్ వేవ్ ముప్పును అధిగమించే అంశంపై కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించడమే మనకు రక్ష. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. టీకా తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారు అని మోదీ అన్నారు. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ.. 75శాతం రాష్ట్రాలుకు అందించనుండగా, 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more