'Noorjahan' mangoes fetch up to ₹1,000 apiece నూర్జహాన్ మామిడి పండ్లకు భలే గిరాకీ.! రైతులకు కాసులు.!!

Noorjahan mangoes fetch up to rs 1 000 apiece in madhya pradesh

noorjahan mango plant price, noorjahan mango price, alirajpur noorjahan mango, Noorjahan mango madhya pradesh, mangoes, noorjahan mangoes, mangoes for rs 1000, gujarat, coronavirus, Alirajpur district, madhya pradesh

The 'Noorjahan' mango, cultivated in Madhya Pradesh's Alirajpur district, is fetching a higher price this year thanks to the good yield and sheer size of the fruit compared with the last year. The 'Noorjahan' mango is priced at ₹500 to ₹1,000 apiece this season

నూర్జహాన్ మామిడి పండ్లకు భలే గిరాకీ.! రైతులకు కాసులు.!!

Posted: 06/07/2021 03:13 PM IST
Noorjahan mangoes fetch up to rs 1 000 apiece in madhya pradesh

సాధార‌ణంగా మామిడి పండ్ల ధ‌ర కిలో రూ.50 నుంచి 70 రూపాయల వ‌ర‌కు ఉంటుంది. కానీ కొన్ని రకాల మామిడి పండ్లకు మాత్రం భలే గిరాకీ వుంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్క కిలో మామిడి పండ్లు ఏకంగా వెయ్యి రూపాయల ధర పలుకుతాయంటే నమ్మకం కలగడం లేదా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇలాంటి కొన్ని రకాల మామిడి పండ్ల రకాలలో ‘నూర్జహాన్‌’ మామిడి పండ్లు కూడా ఒక రకం. వీటికి సాధారణ మామిడి పండ్లకు చాలా తేడాలు వుంటాయి. అందుకనే ఇవి ప్ర‌త్యేకం. ప్రస్తుతం వీటి ధ‌ర ఒక్కోటి గ‌రిష్ఠంగా రూ.1,000కి అమ్ముడుపోతోంది.

ఔనా.. నిజమేనా అంటారా.. మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్‌ జిల్లాలోని మామిడి తోట‌ల్లో ‘నూర్జహాన్‌’ మామిడి కాయలు కాశాయి. కోవిడ్ ఆంక్షలు, లాక్ డౌన్ నిర్ణయాలతో వాటిని మార్కెట్ కు తీసుకెళ్లి అమ్మె అవకాశం లేకపోవడంతో రైతులు కూడా విభిన్నంగా ఆన్ లైన్ బాట పట్టారు. తమ నూర్జహాన్ మామిడి పండ్లను నెట్టింట్లో అమ్మ‌కానికి  పెట్టారు. వాటి ధ‌ర ఒక్కోటి రూ.500 నుంచి రూ.1,000 మ‌ధ్య ఉంది. త‌న‌ తోటలోని మూడు నూర్జహాన్‌ చెట్లకు 250 మామిడి కాయలు కాశాయని అక్క‌డి రైతు చెప్పాడు. ఈ పండ్లన్నీ ఇప్పటికే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ స‌హా పలు ప్రాంతాల వారు బుక్‌ చేసుకున్నారని తెలిపాడు.

ఈ సారి ఒక్కో నూర్జహాన్‌ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉందని అన్నాడు. కాగా, 2019లో నూర్జహాన్‌ మామిడి గరిష్ఠంగా ఒక్కోటి రూ.1,200కి అమ్ముడుపోయింది. ఒక్కో మామిడి పండు అంత గ‌రిష్ఠ ధ‌ర‌కి అమ్ముడు పోవ‌డం అదే తొలిసారి. ఈ మామిడి పండ్లను పండించే అక్కడి తోటల్లో గత ఏడాది సానుకూల వాతావరణం లేకపోవడంతో అప్ప‌ట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మ‌రో రైతు చెప్పాడు. ఈ సారి మాత్రం పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయని వివ‌రించాడు. ఆఫ్ఘన్ మూలాలకు చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే పండిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles