Unique 'Sun Halo' witnessed by Bangaloreans ఖగోళంలో అద్భుతం.. కనువిందు చేసిన సూర్యడి వలయం

Bengaluru witnesses rare 22 degree circular halo around sun

sun halo, rainbow around the sun, halo around the sun, ring around the sun, sun halo in bangalore, sun today, halo sun, solar halo, circular rainbow around sun, halos, rainbow around the sun meaning, circle around the sun today, halo rainbow, sun halo 2021, halo ring, sun halo today, 22 degree circular halo, bengaluru, bengaluru sky, bengaluru sun, bengaluru sun halo, bengaluru weather, bengaluru sky halo, halo, sun halo, bengaluru

The people in Bengaluru witnessed a bright rainbow ring around the sun for a few minutes on Monday morning, a rare optical and atmospheric phenomenon called ‘22 degree circular halo’. ‘22 degree circular halo’ was first seen at around 10:50 am and lasted for over an hour, by this time many had posted social media with the pics of the rare phenomenon.

ఖగోళంలో అద్భుతం.. కనువిందు చేసిన సూర్యడి వలయం

Posted: 05/25/2021 10:09 AM IST
Bengaluru witnesses rare 22 degree circular halo around sun

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గతంలో చైనా సహా మన దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యుడు ఒక్కడిగా కాకుండా మూడు నాలుగు ప్రతిబింభాలను ఒకేసారి అవిష్కరించారు. అయితే ఈ సారి మాత్రం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆకాశంలో అదే తరహాలో ఓ అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. ఉదయం పదిన్నర గంటల సమయం నుంచి గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సమయంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సామాజిక మాద్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో.. వాటిల్లో పోస్టులను చూసిన వారు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి సూర్యుడిని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

సూర్యుడి చుట్టూర ఇంధ్రధనస్సులా ఏర్పడిన వలయాన్ని అత్యంత అందంగా తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఎంతో అద్భుతమైన దృశ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మందికి ఇంధ్రదనస్సు అంటే ఎంతో ఇష్టం. ఆకాశంలో కనిపించగానే..కేరింతలు కొడుతారు. బెంగళూరు నగరంలో కూడా అచ్చు ఇలాగే జరిగింది. సూర్యుడిని కప్పేస్తూ..ఇంధ్రదనస్సు వలే రంగులు కనిపించాయి. దాదాపు గంట పాటు బెంగళూరు ప్రజలను కనువిందు చేసింది. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లు, కెమెరాలలో బంధించారు.

ఈ విధంగా కనిపించడాన్ని 22 డిగ్రీల హాలో అంటారని పలువురు వెల్లడించారు. ఇది కాంతిని చెదరగొట్టడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని, కాంతి యొక్క వృత్తాకారంలో సూర్యుడు లేదా చంద్రుడు చుట్టూ కనిపిస్తుంది. వాతావరణంలో ఏర్పడే మంచు స్ఫటికాల ద్వారా కాంతి ప్రతిబింబించి.. వక్రీభవనం వలన హాలో సంభవిస్తుంది. హాలో అనేది సూర్యుడు లేదా చంద్రుడు నుంచి 22 డిగ్రీల కాంతి వలయం అని, మంచు స్పటికాలతో ఏర్పడే అత్యంత సాధారణమైన కాంతి రకమని ఖగోళశాస్త్రవేత్తలు తెలిపారు. మంచు స్పటికాల గుండా వెళుతున్న సమయంలో…కాంతి రెండు వక్రీభవనాలకు లోను కావడం జరుగుతుందన్నారు. మొత్తానికి ఆకాశంలో జరిగిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి నగర ప్రజలు ఎంజాయ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles