Probe how Gautam Gambhir procured Covid drugs : Delhi HC కరోనామందుల విక్రయంపై దర్యాప్తుకు హైకోర్టు అదేశం

Probe how gautam gambhir procured covid drugs in large quantities delhi hc to drug controller

Gautam Gambhir, BJP MP, Corona Medicines, irresponsible act, Delhi High Court, Investigation, Oxygen cylinders, AAP MLAs, Prethi Thomar, Praveen Kumar, Status Report, New Delhi, Crime

The Delhi High Court on Monday directed Delhi’s Drugs Control Department to launch a probe into BJP MP Gautam Gambhir’s procurement of Fabiflu strips, an essential covid-19 drug, in large quantities when everything was in “short supply.”

పెద్దమొత్తంలో కరోనా మందుల విక్రయంపై దర్యాప్తు చేయండీ: ఢిల్లీ హైకోర్టు అదేశం

Posted: 05/24/2021 10:25 PM IST
Probe how gautam gambhir procured covid drugs in large quantities delhi hc to drug controller

దేశవ్యాప్తంగా కరోనా మందుల కొరత ఏర్పడిన నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు మాత్రం వాటిని పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెద్ద ఎత్తున కరోనా ఔషధాలను కొనుగోలు చేసి వాటిని కోవిడ్ బాధితులకు పంపిణీ చేయడం పట్ల ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా అక్షేపించింది. దేశంలో కోరత వున్న కరోనా ఔషధం.. ఫాబిఫ్లూను పెద్ద సంఖ్యలో ఎలా కొనుగోలు చేశారని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనా మహమ్మారి బాధితులకు ఇచ్చే ఈ అత్యవసర మందును కొరత నేపథ్యంలో ఆయన ఎలా కొనుగోలు చేశారని నిలదీసింది.

ఈ మొత్తం వ్యవహరంలో వారం రోజుల వ్యవధిలో తమకు స్టేటస్ రిపోర్టును అందజేయాలని న్యాయస్థానం డ్రగ్ కంట్రోలర్ ను అదేశించింది. అయితే రాజకీయ నేతలు పెద్దమొత్తంలో కరోనా ఔషధాలను కొనుగోలు చేస్తున్న వ్యవహారంపై విచారణ చేస్తున్న ఢిల్లీ పోలీసులను ఈ కేసును డ్రగ్ కంట్రోలర్ కు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. ఔషధాలకు తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో గంభీర్ వంటి రాజకీయ నేతలు వాటిని పెద్ద మొత్తంలో ఎలా కోనుగోలు చేశారో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర ఔషధాలను గంభీర్ పంపిణీ చేస్తుండడం వెనుక సదుద్దేశాలే ఉండొచ్చు కానీ, అది బాధ్యతాయుతమైన వైఖరి అనిపించుకోదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

గంభీర్ మాదిరిగానే మరో పది మంది కూడా తాము బాధితులకు కరోనా ఔషదాలను ఉచితంగా అందిస్తామని నిలబడే అవకాశాలు వున్నాయని, ఇది సహేతుకం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు, ఆక్సిజన్ సేకరణ, నిల్వ చేస్తున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు ప్రీతి తోమర్, ప్రవీణ్ కుమార్ లపైనా ఇలాంటి విచారణకే ఆదేశించింది. ఈ మేరకు స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్ కంట్రోలర్ కు స్పష్టం చేసింది. ఇప్పటికే నేతలు కరోనా ఔషధాలు పొందుతున్న తీరుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు సంబంధిత సమాచారాన్ని డ్రగ్ కంట్రోలర్ కు అందించాలని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles