Petrol, diesel prices hiked after day’s gap చిత్తూరులో రూ,100 దాటిన లీటరు పెట్రోల్ ధర

Fuel prices at new record highs petrol nears rs 100 litre in jaipur and mumbai

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol and diesel prices: The price of petrol in Delhi currently stands at Rs 93.44 per litre while diesel is now selling at Rs 84.32. In Mumbai, petrol costs Rs 99.71, while diesel is retailing at Rs 91.57.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. రికార్డు దిశగా పయనం..

Posted: 05/25/2021 11:23 AM IST
Fuel prices at new record highs petrol nears rs 100 litre in jaipur and mumbai

ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అములో వున్నా తమ ధరలకు మాత్రం ఎక్కడా చెక్ పెట్టేది లేదని నిర్ణయించుకున్న ఇంధన కెంపెనీలు ఏకంగా మే నెలలో 13వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి, గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది.

ఫలితంగా పలు రాష్ట్రాలలో ఇంధన ధరలు రూ. 100 మార్కును అధిగమించాయి. అంతర్జాతీయంగా పెద్దగా ధరల ప్రభావం లేకపోయినా దేశంలో మాత్రం ఇంధన ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారంతపు సెలవులో యధాతథంగా కొనసాగిన ఇంధన ధరలు ప్రస్తుతం మరోమారు పెరిగాయి. ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి. మే నెలలో ఇప్పటివరకు చమురు ధరను 13 రోజులుగా పెంచుతున్నారు. పెట్రోల్-డీజిల్ రికార్డు స్థాయికి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ 100కి చేరుకుంది. అదే సమయంలో, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతూ సెంచరీ మార్కుకు చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చిత్తూరు జిల్లాలో పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 93.44గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 84.32కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర 99.71గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.57కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 93.49గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 87.16కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 93.49గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 87.32కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 99.03 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 93.08కు చేరింది.
విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 98.18గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.41కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 97.12గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 91.92కు చేరింది.
దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఏకంగా వంద మార్కును చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles