CBI seeks nod to probe Suvendu, Mukul Roy నారదా కేసులో బీజేపి నేతల విచారణకు సీబిఐ నిరీక్షణ.!

Narada case cbi awaits lok sabha speaker s nod to prosecute suvendu adhikari

TMC, Mamata Banerjee, firhad hakim, narada sting case, narada case, Suvendu Adhikari, Mukul Roy, BJP MPs, West Bengal, BJP, Narada Scam, Narada case updates, Narada Scam virtual hearing, Mamata Banerjee, CM of Bengal, Firhad Hakim arrest, Madan Mitra arrested, Sovan Chatterjee arrest, Narada case, Narada case in Bengal

The CBI is waiting for the Lok Sabha Speaker's nod to prosecute four political leaders in the Narada sting case, including BJP's Suvendu Adhikari - who was a Trinamool MP when the tapes surfaced - one of its senior officials said in Kolkata, scotching allegations of bias against the agency by several quarters.

నారదా కేసులో బీజేపి నేతల విచారణకు సీబిఐ నిరీక్షణ.!

Posted: 05/19/2021 02:18 PM IST
Narada case cbi awaits lok sabha speaker s nod to prosecute suvendu adhikari

నారదా కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులతో పాటు ఓ ఎమ్మెల్యే. మరో మాజీ మంత్రిని అరెస్టు చేసిన సీబిఐ.. తాజాగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న బీజేపి నేత సువేందు అధికారిని విచారించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆయనను విచారించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. నారద స్టింగ్ ఆపరేషన్ జరిగిన సమయంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఈ కేసులు అభియోగాలు ఎదుర్కోంటున్న ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యే, సీనియర్ నేతను అరెస్టు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో అరెస్టు చేయగా.. అదే రోజన సాయంత్రం సిబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఈ కేసులో స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా పలువురి నేతల అరెస్టులు జరిగడంపై హర్షం వ్యక్తం చేసిన నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాథ్యూ సామ్యూల్.. ఈ కేసులో ఇంకా పెద్దవాళ్లను అనేక మందిని వదిలేశారని అన్నారు. తాను గతంలో నిర్వహించిన స్టింగ్ అపరేషన్ లో జరిగిన అరెస్టులు.. సముద్రంలో ఓ బింధువు మాత్రమేనని అన్నారు. ఈ కేసులో ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపిలో చేరిన సువేందు అధికారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 2016లో తన స్టింగ్ ఆపరేషన్ టేపులు విడుదల అయ్యాయని, అయితే అందులో చిక్కకున్న రాజకీయ నాయకులపై మూడేళ్ల క్రితమే చార్జిషీటు దాఖలైనా ఇప్పటివరకు సీబిఐ వారిని ముట్టుకోలేదని పేర్కొన్నారు.

నారద స్టింగ్ అపరేషన్ లో చిక్కుకున్న టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం వేచిన సీబిఐ.. తాజాగా లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎందుకు వచిచూస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ అరెస్టుల నేపథ్యంలో టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ, సువేందు అధికారి, ముకుల్ రాయ్ లు బీజేపీలో చేరడంతో సీబీఐ వారిని విచారించడం లేదని ఆరోపించారు. అయితే తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అసలైన దోషులు త్వరలోనే బయటపడతారని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ మండిపడ్డారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ ను నారద న్యూస్ పోర్టల్ ఎడిటర్ మ్యాథ్యూ శామ్యూల్ నిర్వహించారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన విషయాలపై విచారణ జరపాలని 2017 మార్చిలో సీబీఐని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. తాజాగా శామ్యూల్ మాట్లాడుతూ, కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles