Perarivalan gets 30 day unconditional parole రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి నెల రోజుల పేరోల్.!

Stalin orders 30 day leave for rajiv case convict perarivalan

Perarivalan, Perarivalan 30-day leave, Perarivalan leave, Perarivalan M K stalin, Perarivalan rajiv gandhi assassination case, rajiv gandhi assassination case, Puzhal Central Jail, rajiv gandhi, assasination, Arputhammal, chennai, Tamil Nadu, Politics

Tamil Nadu Chief Minister M K Stalin ordered 30-day ordinary leave for A G Perarivalan, Rajiv Gandhi assassination case convict who is lodged in the Puzhal Central Prison here. Stalin, considering a petition from Arputhammal, mother of Perarivalan seeking leave on medical grounds for her son, relaxed relevant rules and “ordered grant of 30 day ordinary leave,” an official release in Chennai said.

రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి నెల రోజుల అన్ కండీషనల్ పేరోల్.!

Posted: 05/20/2021 11:57 AM IST
Stalin orders 30 day leave for rajiv case convict perarivalan

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి 30 రోజుల పెరోల్ లభించింది. ప్రస్తుతుం ఫుళల్ కేంద్ర కారాగారంలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏజీ పేరరివాలన్‌ షరతులు లేని పెరోల్ పై నెల రోజులపాటు బయటకు రానున్నాడు. చెన్నైలో అధికార డీఎంకే పార్టీకి మిత్రపకంగా వున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత అధ్యకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి పేరోల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో ఎంకే స్టాలిన్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఈ పిటీషన్ ఆయన ముందుకు రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. కంగాచెన్నైలోని జైలులో ఉన్న పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల క్షీణించింది. దీంతో రెండు నెలలపాటు తన కుమారుడికి పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తల్లి అర్బుదమ్మాళ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు వినతిపత్రం పంపారు. పరిశీలించిన ముఖ్యమంత్రి పేరరివాలన్‌కు 30 రోజులపాటు షరతులు లేని సాధారణ పెరోల్ మంజూరు చేయాలని నిన్న జైళ్ల శాఖను ఆదేశించారు.

రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ ఒకడు. 21 మే 1991న శ్రీపెరుంబదూర్ సమీపంలో మహిళా సూసైడ్ బాంబర్ ధాను చేతిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. కాగా, గతేడాది మద్రాస్ హైకోర్టు పేరరివాలన్‌కు మెడికల్ చెకప్‌ కోసం 30 రోజుల పెరోల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దానిని మరో వారం రోజులపాటు పొడిగించింది. ఇక తాజాగా నూతనంగా ముఖ్యమంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కూడా ఆయన అనారోగ్యం కారణంగా 30 రోజుల అన్ కండీషనల్ పేరోల్ మంజూరు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles