Ramesh Jarkiholi faces arrest after woman records statement బాధితురాలి వాంగ్మూలంతో మాజీమంత్రికి అరెస్టు భయం

Karnataka cd case jarkiholi faces arrest after woman records statement in court

Sex scandal, Ramesh Jarkiholi, Third Video, FIR filed against former Minister Ramesh Jarkiholi, Ramesh Jarkiholi Sex scandal, Cubbon Park Police Station, lawyer Jagadish Kumar, Karnataka, Crime, Politics

BJP MLA Ramesh Jarkiholi, who had to step down as Karnataka Water Resources Minister earlier this month after TV channels played a video CD allegedly featuring him and a young woman, faces the prospect of arrest. The woman, who accused him of sexual assault and harassment, recorded a statement Tuesday before a magistrate in Bengaluru.

రాసలీలల సీడీ కేసు: బాధితురాలి వాంగ్మూలంతో మాజీమంత్రికి అరెస్టు భయం

Posted: 03/31/2021 12:29 PM IST
Karnataka cd case jarkiholi faces arrest after woman records statement in court

కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన రాసలీల సీడీ వివాదంలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళిని సిట్ అధికారులు విచారణతో పురోగతి సాధించగా.. ఆ వెంటనే 28 రోజుల అజ్ఞాతాన్ని వీడిన బాధిత యువతి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్‌ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాధిత యువతికి సిట్‌పై నమ్మకం లేదని, అంతేకాకుండా ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్‌ కృష్ణ ఆమోదించారు. దీంతో న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. బాధిత యువతిని అత్యంత రహస్యంగా బెంగళూరు వసంతనగరలోని గురునానక్‌ భవన్‌ లోని ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్ లోని ప్రత్యేక కోర్టుకి చేరుకుని.. న్యాయమూర్తి ఎదుట రెండు గంటల వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్‌ చేశారు. ఈ సమయంలో న్యాయస్థానంలో న్యాయమూర్తి, బాధితురాలు, ఒక స్టెనోగ్రాఫర్‌ మాత్రమే ఉన్నారు.

కోర్టు అనుమతి పోందిన సిట్‌ పోలీసులు బాధితురాలని అదుపులోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించి.. రాత్రి వరకు అమెను సిట్ విచారించింది. ఇవాళ కూడా విచారణకు రావాలని అదేశించింది. కాగా, బాధితురాలి తరపు న్యాయవాది జగదీశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము ఇచ్చిన మాట ప్రకారం బాధితురాలిని కోర్టులో హాజరుపర్చామని, ఇక పోలీసులు వారి పనిని చేయాలని.. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలు నిర్భయంగా జరిగిన ఘటనను న్యాయమూర్తి ఎదుట వెళ్లడించిందని తెలిపారు.

తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని.. రమేశ్‌ బలమైన నాయకుడు.. తనను బెదిరించడంతో ప్రాణ భయం దాక్కున్నానని బాధితురాలు తెలిపింది. తన తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్‌ ఒత్తిడి చేస్తున్నారు. తన కుటుబానికి రక్షణ కల్పించాలని కూడా బాధితురాలు కోరినట్లు సమాచారం. అలాగే తనకు రమేశ్‌ ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్‌ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించింది. మరోవైపు వైద్య పరీక్షలు చేసే వరకు తమ రక్షణలో ఉండాలని, అందుకోసం ఎనిమిది మంది మహిళా పోలీసులతో యువతికి భద్రత కల్పించినట్లు తెలిసింది.  

రాసలీలల సీడీ కేసులో చిక్కుకున్న మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఇన్నాళ్లు తనకేం కాదని బలంగా వాదనలు వినిపించారు. ఇక బాధిత యువతి న్యాయమూర్తి ఎదుట హాజరుకావడంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది. ఇన్నాళ్లు ఆయనకు మద్దతుగా నిలిచిన సొంతపార్టీ నేతలు దూరం జరగడంతో ఆయన ఏకాకిగా మారారు. ఆయన అరెస్టు తప్పదని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన న్యాయనిపుణులతో కూడా చర్చించారు. వారి సూచనమేరకు ముందస్తు బెయిల్ పొందేందుకు సిద్ధమైయ్యారు. జార్కిహొళి బెళగావిలో ఉన్నా.. అక్కడి ఉప ఎన్నిక నామినేషన్ల కోసం వెళ్లిన సీఎం యడియూరప్ప అక్కడే వున్నా ఇరువురు కలవలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles