NCB detains actor Ajaz Khan in drugs case ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

Bollywood actor ajaz khan detained by ncb at mumbai airport

Ajaz Khan, Bigg Boss, contestant, Narcotics Control Bureau, Mumbai airport, Maharashtra, crime

Bollywood actor and former Bigg Boss contestant Ajaz Khan was detained by the Narcotics Control Bureau (NCB) in connection with a drug case, an official said. Khan's name had cropped up during interrogation of drug peddler Shadab Batata, he said.

ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

Posted: 03/31/2021 01:35 PM IST
Bollywood actor ajaz khan detained by ncb at mumbai airport

బాలీవుడ్ వివాదాస్పద నటుడు, బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్ అజీజ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను  ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో భాగంగా అజాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఎన్సీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాజస్థాన్ నుంచి ముంబైకి విమానంలో వచ్చిన అజాజ్ ఖాన్ ను, ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, మాదక ద్రవ్యాలను పలువురికి సరఫరా చేసిన షాదాబ్ బటాటాను విచారించిన వేళ, ఖాన్ పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆపై ఈ కేసుకు సంబంధించి లోఖండ్ వాలా, అంధేరీ తదితర ప్రాంతాల్లో సోదాలు కూడా చేసింది. ప్రస్తుతం అజాజ్ ను నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తుండగా, ఇదే కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అజీజ్, తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, తానే స్వయంగా అధికారులను కలిసేందుకు వచ్చానని పేర్కొనడం గమనార్హం.

కాగా, డ్రగ్స్ కేసులో అజాజ్ ఖాన్ పై ఆరోపణలు రావడం, విచారణను ఎదుర్కోవడం ఇదే తొలిసారేమీ కాదు. మూడేళ్ల క్రితం 2018లోనూ ముంబై పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేశారు. ఆపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసిన కేసులో 2019లో రెండోసారి, ఫేస్ బుక్ లో అసభ్య పోస్టులు పెట్టినందుకు ఏప్రిల్ 2020లో మరోసారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ 7, 8వ సీజన్ లలో కనిపించిన అజాజ్ పలు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajaz Khan  Bigg Boss  contestant  Narcotics Control Bureau  Mumbai airport  Maharashtra  crime  

Other Articles

Today on Telugu Wishesh