Railways restrictions on mobile phones chargingరైళ్లలో ఇక సెల్ ఫోన్లు, లాప్ టాప్ లకు చార్జింగ్ ఉండదు

Railways will tell passengers to not charge laptops and phones at night

indian railways, no charging of phones, charging phone on trains, train charging, restrictions on mobile phones charging, restrictions on laptops charging, Railways Department, cell charging, Night journeys, Delhi, Fire Accident, Crime

Indian Railways has decided to put restrictions on charging mobile phones, laptops during certain hours to prevent fire hazards on trains. So, if you are traveling between 11 pm and 5 am on a train, you will not be able to charge your mobile phone or laptop.

రైళ్లలో ఇక సెల్ ఫోన్లు, లాప్ టాప్ లకు చార్జింగ్ ఉండదు.. ఆ సమయాల్లో..

Posted: 03/31/2021 11:17 AM IST
Railways will tell passengers to not charge laptops and phones at night

రైళ్లలో నిత్యం ప్రయాణించేవారు తమ చార్జర్ ను వెంటబెట్టుకుని రైళ్లలో చార్జింగ్ చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఇకపై మాత్రం అలా కుదరదు. రైళ్లలో ఎప్పుడు పడితే అప్పుడు చార్జింగ్ పెట్టుకోవాలంటే.. ఇకపై అది సాధ్యం కాదు. అదేంటి అంటారా.? ఇకపై రైళ్లలో సెల్ ఫోన్ చార్జింగ్ స్లాట్లు మాత్రం వుంటాయి. కానీ అందులో పవర్ మాత్రం పాసవద్దు. ఎందుకుంటారా.. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది.

రైల్వేలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. దీంతో మొబైల్‌ ఛార్జింగ్‌ పరికరాలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ఆదేశాలు గతంలో వచ్చినవేననీ, తాజాగా మరో సారి రైల్వే బోర్డు వీటిని జారీ చేసిందని దక్షిణ రైల్వే సీపీఆర్‌వో  చెప్పారు. రైలు బోగీల్లో ఉండే చార్జింగ్‌ స్టేషన్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో స్విచ్ఛాఫ్‌ చేసి ఉంచాలని గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ప్రతిపాదించారు. ఆ సమయంలోనే బెంగళూరు–నాందేడ్‌ రైలులో అగ్నిప్రమాదం సంభవించడంతో అన్ని జోన్లలోనూ సెల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను రాత్రి వేళల్లో ఆపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways Department  cell charging  Night journeys  Delhi  Fire Accident  Crime  

Other Articles