Petrol, diesel prices reduced after more than a year 10శాతం మేర తగ్గిన క్రూడ్ అయిల్.. 18 పైసలు తగ్గిన పెట్రోల్

Petrol and diesel prices cut after 24 days as crude oil slips 10 in eight days

oil price, crude oil, price hike, petrol, diesel, premium petrol price, sriganganar, rajasthan, petrol price in delhi, petrol price in mumbai, petrol price in chennai, petrol price in kolkatta, petrol price in hyderabad, petrol price in amaravati, dissel price in delhi, dissel price in mumbai, dissel price in chennai, dissel price in kolkatta, dissel price in hyderabad, dissel price in amaravati, regular petrol price, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

In the first reduction in rates in over a year, the petrol price on Wednesday was cut by 18 paise per liter and diesel by 17 paise a liter as international oil prices tumbled to the lowest since early February. Petrol price was cut to Rs. 90.99 a liter in Delhi from Rs. 91.17 per liter, according to a price notification of state-owned fuel retailers.

ITEMVIDEOS: 10శాతం మేర తగ్గిన క్రూడ్ అయిల్.. 18 పైసలు తగ్గిన పెట్రోల్

Posted: 03/24/2021 01:26 PM IST
Petrol and diesel prices cut after 24 days as crude oil slips 10 in eight days

దేశంలో ఇంధన ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌ 18పైసలు, డీజిల్ పై 17 పైసలు తగ్గిస్తూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర ఇంతకుముందు రూ.91.17 ఉండగా.. 18పైసలు తగ్గి రూ.90.99కి చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.81.47 ఉండగా.. 17 పైసలు తగ్గి రూ.81.30 చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.40, డీజిల్‌ ధర రూ.88.42గా నమోదైంది. ఇక హైదరబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.61గా, డీజిల్‌ ధర రూ.88.67గా ఉంది.

గత కొంత కాలంగా దేశంలో ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల నమోదైన విషయం తెలిసిందే. గతేడాది మార్చి 16 తర్వాత పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. మార్చి 19న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత జూన్ నుంచి పరిమితులతో కూడిన అన్ లాక్ తో దేశంలో వాహనాలు తిరగడం ప్రారంభించాయి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడాది కాలంపైన చమురు ధరలు తగ్గడం ఇదే ప్రధమం. ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. దేశంలో పెట్రోల్ పై రూ.21.58, డీజిల్ పై రూ.19.18 పెరగడం గమనార్హం. గత నెలలో రాజస్థాన్‌, మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు రూ.100 మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  Hyderabad  

Other Articles