Clever Monkey Teaches Tiger a Lesson చెట్టులెక్కగలవా.. ఓ పెద్దపులి.. నన్ను పట్టగలవా.?

Viral video tiger climbs tree to hunt clever monkey teaches him a lesson

Clever Monkey Video, Monkey Video, Tiger hunt fails, miserable failure of tiger hunt, Social Media, IFS Praveen Angusamy, Viral Video, Video Viral

Clever Monkey Video: A fascinating video of a tiger trying to hunt a monkey is going viral on social. The tiger failed miserably as he tried to hunt a clever monkey on top of a tree.

ITEMVIDEOS: వైరల్ వీడియో: చెట్టులెక్కగలవా.. ఓ పెద్దపులి.. నన్ను పట్టగలవా.?

Posted: 03/24/2021 01:23 PM IST
Viral video tiger climbs tree to hunt clever monkey teaches him a lesson

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా? ఓ నరహరి! చిగురు కోయగలవా? అని చెంచులక్ష్మీ చిత్రంలో పాట తరహాలో ఓ కోతి కూడా తనవైపునే చూస్తు చెట్టు ఎక్కాలా వద్దా.? అని అలోచిస్తున్న పెద్దపులిని చూపి పాడింది. ఇంకేముంది చెట్టులెక్కగలనే! ఓ మర్కటమా పుట్టలెక్కగలనే అంటూ పులి చెట్టు ఎక్కింది. ఇక ఆలస్యమేలా అనుకుందో ఏమో తెలియదు కానీ ఏకంగా చకచకా ఎక్కుతూ చిటారు కొమ్మకు చేరింది. ఇక అక్కడే వచ్చింది అసలు సమస్య.

పెద్దపులి బరుపును చెట్టు కోమ్మలు అపలేకపోతున్నాయి. ఇక వంగిపోతున్న కొమ్మలపై తన బరువును బాలెన్సు చేసుకుంటూ మెల్లిగా కోతి వద్దకు చేరింది పులి. ఇక మరో రెండు అడుగులు వేస్తే.. తనకు ఆహారం సిద్దంగా వుంది. పులి వేటాడే సమయంలో తప్పనిసరిగా తన పంజాను బలంగా విసురుతుందని, ఆ దెబ్బతో ఎదురుగా వున్న ఏ జంతువైనా గాయపడి కిందపడిపోతుందన్నది అందరికీ తెలిసిందే. అయితే కోతి మాత్రమే బహుబాగా పట్టున్న చెట్లపై.. పులి ఎలా పంజావిసురుతుంది. పులి పంజా విసిరినా.. ఆ కొద్దిక్షణం చాలాదా ప్రవంగము తప్పించుకోడానికి.. చివరకు ఇక్కడా అదే జరిగింది. పులి అడుగుముందుకేస్తే చెట్టు నుంచి పట్టు తప్పి కిందపడుతుంది.

ఆ విషయం తెలిసిన తెలివైన కోటి పులి పంజా కోసం కాలు కదపుతుండగానే పక్కకు జరిగింది. అంతే పుటి కాస్తా పట్టుతప్పి చెట్టు నుంచి కిందపడి బేళగా ఓ చూపు ఎవరైనా తనను చూస్తున్నారా.? అన్నట్టుగా గమనించింది. అడుగుదూరంలో వున్న ఆహారం పోయిందిపో అంటూ నిట్టూర్చుతూ.. చెట్టు కిందే సేదతీరింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుస్వామి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేయగా, అప్పుడే వైరల్ అయ్యింది. అయితే ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అన్న వివరాలను తెలుపని ఆయన.. ఇకపై ఎప్పుడూ నీ బలహీనతలను పట్టుకుని వేలాడకు.. నీ బలాన్ని తెలుసుకుని మసలుకో.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Don&#39;t push your weaknesses, always know &amp; play with your strengths. <a href="https://t.co/vhPmxy8nu8">pic.twitter.com/vhPmxy8nu8</a></p>&mdash; Praveen Angusamy, IFS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles