Mob attacks traffic cops after engineer dies in accident కానిస్టేబుల్ ను చితకబాదిన స్థానికుల్లో 13 మంది అరెస్టు

Mob attacks traffic cops 13 held booked under various sections after motorist dies

Mysuru, Traffic Cop, Karnataka, Accident, Bengaluru, Mob, Assault, Mysuru cop attacked, mob attacks cop Mysuru, cop attacked by mob Mysore, mob attacks cop Mysore, traffic police assault Mysore, traffic cop beat up Mysore, mob attack, policemen, 13 held, accident, Outer Ring Road, Hinkal flyover, video viral, social media, Mysuru, Karnataka, Crime

A video of mob attacking a traffic policeman in Mysuru has gone viral on social media. The incident reportedly occured after a man was killed in a road accident nearby. The mob, assuming that the policeman had tried to stop the bike which in turn caused it to fall, surrounded the official and can be seen hitting him.

ITEMVIDEOS: ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చితకబాదిన స్థానికుల్లో 13 మంది అరెస్టు

Posted: 03/24/2021 03:03 PM IST
Mob attacks traffic cops 13 held booked under various sections after motorist dies

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో జరిగిన ఓ ఇంజనీరు ప్రమాదానికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ.. ఆగ్రహావేశాలకు లోనైన స్థానికులు కొందరు స్థానికంగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును చితకబాదారు. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనదారుడు జారి పడి మరణించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పోలీసుల ఓవరాక్షన్ వల్లే యువకుడు చనిపోయాడంటూ.. అవేశానికి లోనైన స్థానికులు ట్రాఫిక్ పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పోలీసులపై దాడికి పాల్పడిన వారిలో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తప్పించుకుని తిరుగుతున్న మరో ఐదుగురి కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ప్రమాదఘటన అనంతరం ట్రాపిక్ పోలీసును స్థానికులు చితకబాదుతున్న వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.. మైసూరు నగరం బోగాది రింగ్‌ రోడ్డుపై దేవరాజ్‌ బైక్‌ నడుపుతుండగా సురేష్‌ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. అదే మార్గంలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్‌ పై ఉన్న ఇద్దరు అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో దేవరాజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయాడు.

ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో స్థానికులకు సర్ధి చెప్పే క్రమంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వివాదం ముదిరింది. కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్‌ మంజులపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఓ పోలీస్‌ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బైక్‌ను టిప్పర్‌ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్‌ ప్రమాదంలో గాయపడిన సురేష్‌ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్‌ తమ బైకుకు చేరువ నుంచి వేగంగా వెళ్లడంతోనే తాము అదుపుతప్పి కిందపడ్డామని ఆ తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. ఇదిలావుంటే, దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశామని, మరో ఐదుగురి కోసం తనిఖీలు చేస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mob attack  policemen  13 held  accident  Outer Ring Road  Hinkal flyover  video viral  social media  Mysuru  Karnataka  Crime  

Other Articles