CJI Bobde recommends Justice N V Ramana as his successor సీజేఐగా ఎన్వీ రమణను ప్రతిపాదించిన జస్టిస్ బోబ్డే

Cji sa bobde recommends justice nv ramana as his successor sends letter to law ministry

CJI, SA Bobde, Justice NV Ramana, Supreme Court, Law Ministry, Ranjan gogoi, Chief Justice of India (CJI), India, Andhra Pradesh, Politics

Chief Justice of India (CJI) SA Bobde has recommended the name of Justice NV Ramana to the Centre for appointing him as his successor after he demits office on April 23, 2021. Justice Bobde was sworn in as the 47th Chief Justice of India in November 2019, succeeding Justice (retired) Ranjan Gogoi.

తదుపరి సీజేఐగా తెలుగువాడు.. ఎన్వీ రమణను ప్రతిపాదించిన జస్టిస్ బోబ్డే

Posted: 03/24/2021 12:19 PM IST
Cji sa bobde recommends justice nv ramana as his successor sends letter to law ministry

భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో తెలుగవాడైన జస్టిస్ ఎన్వీ రమణ త్వరలో అసీనులు కాబోతున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆయన బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ మేరకు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప్ర‌తిపాదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ‌కు జ‌స్టిస్ బోబ్డే లేఖ రాశారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ‌చ్చే నెల ఏప్రిల్ 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజేఐ పేరును ప్ర‌తిపాదించాల‌ని వారం రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌ను కోరింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ ఈ మేర‌కు జ‌స్టిస్ బోబ్డేకు లేఖ పంపుతూ అందులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎన్వీ రమణను తన తరువాత ఆ పదవిలో నియమించాల్సిందిగా ప్రతిపాదించారని తెలిసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌క్రియ ప్ర‌కారం బోబ్డే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో జ‌స్టిస్ బోబ్డే త‌ర్వాత జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మోస్ట్ సీనియ‌ర్ జడ్జి.  ఎన్వీ ర‌మ‌ణ 2022, ఆగ‌స్టు 26న రిటైర్ అవుతారు.

ఎన్వీ ర‌మ‌ణ 1957, ఆగ‌స్టు 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఓ వ్య‌వ‌సాయం కుటుంబంలో జ‌న్మించారు. 2000, జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు శాశ్వ‌త జడ్జిగా నియ‌మితుడ‌య్యారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు ఢిల్లీ హైకోర్టు జ‌డ్జిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కాగా, జ‌స్టిస్ బోబ్డే  2019 న‌వంబ‌రులో సుప్రీంకోర్టు 47వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ (రిటైర్డ్) రంజ‌న్‌ గొగొయ్ స్థానంలో‌ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 48వ సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును ఆయ‌న ప్ర‌తిపాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CJI  SA Bobde  Justice NV Ramana  Supreme Court  Law Ministry  India  Politics  

Other Articles