Telangana marching ahead with confidence: Governor ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చామన్న గవర్నర్.!

State economy did not slip out of control due to covid governor tamilisai

Telangana governor Tamilisai, Tamilisai soundararajan budget speech, Telangana Assembly session, Telanagan Budget session governor speech, Telangana governor, aasara pension, kaleswaram project, mission bhagiratha, rythu bandhu, rythu bima, Tamilisai soundararajan, Assembly session, Budget session, TRS Government, Governor speech, Telanagana

Governor Tamilisai Soundararajan on Monday said Telangana State, which has been marching ahead with development in all sectors besides ensuring welfare to all sections of society, was now stepping into another financial year with a lot of confidence.

ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చామన్న గవర్నర్.!

Posted: 03/15/2021 02:49 PM IST
State economy did not slip out of control due to covid governor tamilisai

సమైక్యవాదుల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే రాజధాని ప్రజల సమస్య వర్ణణాతీతం. వారం రోజులకో పర్యాయం లేద వారానికి రెండు పర్యామాలు మాత్రమే తాగునీరు లభించేదని అలాంటిది తెలంగాణ రాష్ట్రం సాకరమైన ఆరేళ్ల వ్యవధిలోనే మిషన్ భగీరథ పథకంలో గ్రామాపంచాయతీ నుంచి అమ్ లెట్ గ్రామాల వరకు అందరికీ నీరు అందిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు, ఇక రాజధాని ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా మంచినీరు అందించే కార్యకరమాన్నికూడా చేపట్టామని అన్నారు.

కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజల అర్థికస్థితిపై బారం పడిందని, అయినా తెలంగాణా రాష్ట్రం మాత్రం కోవిడ్ నుంచి కోలుకుని వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అమె రాష్ట్రంలోని ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల పురోగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఆరున్నర సంవత్సరాల మేధోమధనం ఫలితంగా తెలంగాణ దూసుకెళోందని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నామని అన్నారు. పారిశ్రామికీకరణ ద్వారా అనేక ఉద్యోగావకాశాలను కల్పించామని చెప్పారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టిని సారించామని అన్నారు. సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2.28 లక్షలకు పెరిగిందని తమిళిసై చెప్పారు. కరోనా వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని, తమ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణను పాటిస్తున్నామని చెప్పారు. అనేక విషయాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని అన్నారు. వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పారు. విద్యుత్ రంగంలో అద్వితీయమైన విజయాలను సాధించిందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా అవతరించిందని అన్నారు.

మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తండాలు, గిరిజన గ్రామాలకు కూడా మంచి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చామని చెప్పారు. సమైక్యాంధ్రలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని... తాము పెండింగ్ ప్రాజక్టులను పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. రైతు బంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లను ఇస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles