Cop takes care of baby, helps mother vote డ్యూటీకి మించి సేవ చేసిన మహిళా కానిస్టేబుల్ కు రివార్డు.!

Bibinagar constable kavitha rewarded by rachakonda cp for going beyond call of duty

telangana mlc elections, telangana mlc elections 2021, mlc elections hyderabad 2021, mlc elections in hyderabad, telangana elections, telangana police news, telangana election news, telangana updates, woman constable, Kavitha, reward, Rachakonda CP, Mohan Bhagawat, MLC Election, Bibi Nagar, Yadadri District, Telangana, crime

The polling for the two Graduates MLC Elections went off peacefully under tight police bandobast in Hyderabad and neighbouring Ranga Reddy and Medchal districts in the State of Telangana. As the voters waited for their turn to cast their votes, a feeding mother braved the heat to vote.

డ్యూటీకి మించి సేవ చేసిన మహిళా కానిస్టేబుల్ కు రివార్డు.!

Posted: 03/15/2021 03:50 PM IST
Bibinagar constable kavitha rewarded by rachakonda cp for going beyond call of duty

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు.. చూడ చూడ రుచులు జాడ వేరు.. పురుషులందు పుణ్య పురుషులు వేరయా.. అని వేమన తన పద్యములో చెప్పినట్లు.. పోలీసులు అనగానే సర్వాసాధారణంగా ప్రజల్లో ఓ భయం వుంటుంది. అయితే వారిని చూసి భయపడాల్సిన పనిలేదని.. కనిపించే కాకి చోక్కాల కాఠిన్యం మాత్రమే చూసి దడుచుకోవాల్సిన పనిలేదని.. వాటి వెనుక వుంటే మనిషుల్లోని మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు కొందరు  వార్తల్లో నిలవడంతో పాటు ఉన్నతాధికారుల నుంచి ప్రశ్నంసలను కూడా అందుకుంటున్నారు.

తాజాగా కూడా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ తన విధులతో పాటు అంతకుమించిన సేవా గుణం ప్రదర్శించడంతో అమెను ప్రశంసించడంతో పాటు రివార్డును కూడా ప్రకటించారు ఉన్నతాధికారులు. ఇంతకీ అమె చేసిన సేవ ఏంటీ.? ఎక్కడ.? ఎందుకని అమెను ఉన్నతాధికారులు ప్రశంసించారు అన్న వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి జిల్లా బీబీనగర్ ప్రాంతంలో నిన్న జరిగిన హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఇక్కడ కవిత అనే ఓ మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది.

మండుటెండను లెక్కచేయని ఓ మహిళా ఓటరు తన చంటిబిడ్డతో పాటు పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. అసలే అదివారం.. అందునా మండుటెండ.. దీంతో పెద్దగా ఎమ్మెల్సీ ఎణ్నికలకు ఓట్లు పడతాయో పడవోనని భావించినా.. ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇలా వచ్చిన చిన్నారి చంటిపాపను ఎత్తుకున్న ఓ మహిళా ఓటరు రాగానే.. అమె తన బిడ్డను ఎవరికైనా అప్పగించి ఓటు వేద్దామా.. అని చూస్తుండగా, అమెకు కానిస్టుబుల్ కవిత కనిపించింది. అంతే అమె చేతిలో తన బిడ్డను పెట్టి వెళ్లి ఓటుహక్కును వినయోగించుకుని వచ్చారా ఓట‌రు.

అయితే తన చేతుల్లో ఉన్న చంటిబిడ్డ ఏడవకుండా చక్కగా అధిమిపట్టుకున్న నేపథ్యంలో కానిస్టేబుల్ క‌వితకు.. ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు. అదేంటి వారికెలా విషయం తెలిసిందీ అంటే.. క‌విత ఆ బిడ్డ‌ను ఎత్తుకుని ఉండ‌గా తోటి పోలీసులు ఫొటో తీశారు. ఇలా తీసిన ఫోటోలు తమ గ్రూపులో అప్ లోడ్ చేయగా అది కాస్తా రాచకొండ పోలీస్ కమీషనర్ మోహన్ భగవత్ దృష్టిలో పడింది. వెంటనే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న ఆయన.. తమ పోలీసుల ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి క‌విత‌ను అభినందించారు. దీంతో నెటిజ‌న్లు కూడా కవితపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh