CM Sir, Please Bring Back Those Brands నంద్యాల బ్యాలెట్ బాక్సుల్లో.. మద్యంబాబుల డిమాండ్లు..

Boozers demand old liquor brands instead of new in nandyal of kurnool

Drunkards, Boozers, Liquor brands, Nandyal, Excise Policy, AP Government, Voter slips, ballot boxes, AP CM YS Jagan, Andhra Pradesh, crime

In Nandyal, an incident has caught the attention while the polling staff were in shock on how to react to this. Going into details, at 29th ward when the polling staff opened up the ballot box for counting, they found paper slips of voters. These paper slips were dropped in the ballot box by drunkards requesting CM Jagan to bring back old alcohol brands such as Royal Stag, Black Dog etc.

నంద్యాల బ్యాలెట్ బాక్సుల్లో.. మద్యంబాబుల డిమాండ్లు..

Posted: 03/15/2021 01:12 PM IST
Boozers demand old liquor brands instead of new in nandyal of kurnool

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయదుంధఃభి మ్రోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆ వెంటనే వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయఢంకా మ్రోగించింది. అదేంటి గడిచిన విషయాలను మళ్లీ చెబుతున్నారెందుకు అనుకుంటున్నారా.? ఈ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు బ్యాలెట్ బాక్సుల్లో వారి అభిప్రాయాలను కూడా ప్రభత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ రౌడీ చిత్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు తమ ఆకాంక్షలను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు.

తమ విన్నపాలు ముఖ్యమంత్రి వెఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెరుతాయని, లేని పక్షంలో మీడియా తమ విన్నపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేలా చేస్తోందని వీరు బలంగా భావించి ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇంతకీ ఓటర్ల అకాంక్షలు ఏమిటన్న వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తమ అకాంక్షను వ్యక్తంచేశారు.  అక్కడి ప్రజలు. ఇలా రాసివున స్లిప్పులను విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓెటర్లు వేశారు. తద్వారా తమ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికులు తమ డిమాండ్ ను మరోమారు కూడా పునరుద్ఘాటించారు.

ఇక తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఇలాంటి స్లిప్పులు ఎన్నికల అధికారులను విస్తుపోయేలా చేశాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాల 29వ వార్డు బ్యాలెట్ బాక్సులను తెరిచిన సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని విస్మయానికి గురిచేసింది. ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు. సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని... రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని కోరారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ సీఎంను ఉద్దేశించి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles