Rahul Gandhi dubs BJP as 'Burden the Janta, Party' బీజేపికి రాహుల్ కొత్త బాష్యం.. ధరాఘాతంపై కాంగ్రెస్ యుద్దం.!

Rahul gandhi dubs bjp as burden the janta party slams rising essential commodities prices

Rahul Gandhi, Price rise, essential commeondities, #SpeakUpAgainstPriceRise, BJP, Burden the Janata Party, Twitter, National, Politics

The Congress launched a 'Speak Up Against Price Rise' online campaign with former party chief Rahul Gandhi accusing the central government of pushing people in the swamp of price rise just to earn taxes. The Congress, from its official Twitter handle, urged people to participate in the online campaign by speaking out against price rise.

బీజేపికి రాహుల్ కొత్త బాష్యం.. ధరాఘాతంపై కాంగ్రెస్ యుద్దం.!

Posted: 03/05/2021 03:11 PM IST
Rahul gandhi dubs bjp as burden the janta party slams rising essential commodities prices

కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనాతో కాకవికళమైన దేశప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వ్యాపారం ధోరణితో వ్యవహరిస్తూ వారిని అంతంపాతాళానికి దిగజార్చుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే ‘బర్డన్ జనతా పార్టీ’ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. ధరఘాతాన్ని ప్రజల నెత్తిన పెట్టి ధరలను ఆకాశాన్ని తాకేలా పెంచుతూపోతున్న పార్టీ బీజేపి అని దుయ్యబట్టారు.

ధరల బరువును ప్రజల నెత్తిన పెట్టి భరించాలని మోయిస్తున్న పార్టీ బీజేపి అని ఆయన నిర్వచనం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తమ ట్విట్టర్ వేదికగా ధరాఘాతంపై యుద్దాన్ని ప్రకటించారు. దేశంలోని ప్రజలందరూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలపై తమ ధరాఘాత ఉద్యమానికి మద్దుతు ఇవ్వాలని కోరారు. త్వరలోనే తాము బీజేపీ నాయకులు దోచుకున్న ప్రజాధనం వివరాలపై మాట్లాడతామన్న ఆయన.. ఈ అవినీతికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని సూచించారు.

దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బీజేపీ దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ‘‘పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి’ అని ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని, పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు పెరిగిన పెట్రోధలకు సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles