Vijayasai Reddy faces setback in vizag during state bandh విజయసాయి రెడ్డికి పరాభవం.. యాంకర్ గా మారిన ఎంపీ..

Vijayasai reddy turns anchor faces setback as citu activist gives befitting reply

VijaySai Reddy fires on CiTU Union Activist, set back to YCP MP Vijay Sai Reddy, Ganta Srinivas Rao, TDP MLA, vizag steel plant trade unions bandh, TDP, YSRCP, Visakhapatnam, Andhra Pradesh, Politics

Set back to YSRCP MP Vijayasai Reddy, as he turns anchor at an rally conducted today in vizag, opposing the centre's decision in Privatisation of Visakha steel plant, as an CITU Employee's Trade Union Worker gives him a mind blowing answer.

ITEMVIDEOS: విజయసాయి రెడ్డికి పరాభవం.. యాంకర్ గా మారిన ఎంపీ..

Posted: 03/05/2021 01:31 PM IST
Vijayasai reddy turns anchor faces setback as citu activist gives befitting reply

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కాస్తా రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమంలో తాము కార్మికుల వైపే వున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ.. బంద్ కు మద్దతు తెలిపింది. అయితే ఇదే సంకేతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఇవాళ వైజాగ్ లో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలతో పాటు అన్ని పార్టీల మద్దతుతో జరుగుతున్న.. రాష్ట్రబంద్ లో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన మానవహారంలో పలువురు అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి పరాభవం ఎదుర్కోన్నాడు.

అంతేకాదు సమాధానం కోరిన వ్యక్తి పూర్తి అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పకముందే.. నోరు అదుపులో పెట్టుకో.. అంటూ కోపగించుకుని ముందుకు కదిలారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించగా, విశాఖ నగరంలో బంద్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర బంద్ లో మానవహారాన్ని నిర్మించుకుంటూ... యాంకర్ గా మారి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆయనకు చెక్కెదురైంది. ఆయనకు ఓ కార్మికసంఘానికి చెందిన నాయకుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  

పోస్కోతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో రహస్యంగా చేసుకున్న ఒప్పందం అంటూ ఆ వ్యక్తి మరోసారి జవాబిచ్చాడు. అధికారులకు కూడా తెలియకుండా జరిగిపోయిందని విమర్శించాడు. ఆ మాటకు విజయసాయి మండిపడ్డారు. ‘‘కరెక్టుగా మాట్లాడు.. నోరు అదుపులో పెట్టుకో.. ’’ అంటూ విసవిసా నడిచిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles