Swapna Suresh Names CM in Gold Smuggling Case కేరళ సీఎం పినరయిపై స్వప్నాసురేష్ సంచలన అరోపణలు

Gold smuggling case swapna suresh made shocking revelations about cm customs tells hc

Kerala High Court, Kerala Gold Smuggling Case, Swapna Suresh, Customs Deparment, Kerala CM Pinarayi Vijayan, Kerala Speaker, Kerala Cabinet Ministers, diplomatic channels, Kerala, Crime

The Customs Deparment has told the Kerala High Court that the prime accused in gold smuggling case, Swapna Suresh, has made "shocking revelations" against Kerala CM Pinarayi Vijayan, Speaker and three Ministers in her statement recorded under Section 164 CrPC.

కేరళ సీఎం పినరయిపై స్వప్నాసురేష్ సంచలన అరోపణలు

Posted: 03/05/2021 04:13 PM IST
Gold smuggling case swapna suresh made shocking revelations about cm customs tells hc

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇప్పటికే పలు పార్టీలో ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చిక్కుల్లో పడ్డారు. ఆయననే కాదు ఆయన ప్రభుత్వానికి చెందిన ముగ్గురు క్యాబినెట్ మంత్రులు కూడా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. వీరితో పాటు కేరళ అసెంబ్లీ స్పీకర్ కూడా వీరితో పాటు అరోపణలు ఎదుర్కోంటున్నారు. 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసుతో సీఎం పినరయి విజయన్ కు సంబంధముందని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల వేళ కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో ఇదే విషయాన్ని పోందపర్చడం కేరళ రాజకీయాల్లో పెనుదుమారం రాజుకుంది.

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్ కూడా ఇదే విషయాన్ని తమ దర్యాప్తులో వెల్లడించారని కస్టమ్స్ అధికారులు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ స్మగ్లింగ్‌లో సీఎం పినరయ్ విజయన్ పాత్ర కూడా ఉందని, ఆయన నిండా మునిగారని కస్టమ్స్ అధికారులకు చెప్పారు. సీఎం పినరయ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రుల పేర్లను కూడా స్వప్నా సురేశ్ విచారణ సందర్భంగా బయటపెట్టారు. ముగ్గురు మంత్రులతో పాటు స్పీకర్ కూడా ఇందులో పాత్రధారి అంటూ ఆమె వెల్లడించారు. ఇదే విషయాన్ని కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు కూడా వెల్లడించారు.

‘‘సీఎం విజయన్‌ అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్‌కు, సీఎం విజయన్‌కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్‌లో సీఎంతో సహా మంత్రులకు కోట్లాది రూపాయలు కమిషన్‌గా ముట్టిందని స్వప్న సురేశ్ దర్యాప్తు సందర్భంగా వెల్లడించారు.’’ అని కస్టమ్స్ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కు వస్తున్న పార్శిల్ లో 15 కోట్లు విలువచేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేరళను కుదిపేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో కేరళ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles