Guard Dog Takes A Nap During Mock Robbery Drill కుక్కను తిట్టిపోస్తున్న నెట్ జనులు.. ఎందుకో తెలుసా.?

Guard dog takes a quick snooze during a mock drill in thailand

Guard Dog, Thailand Police, Mock Robbery Drill, Guard Dog Takes A Nap, Netigens, Bankok, Thailand, viral video, video viral

A video has gone viral which shows a husky 'guard dog' fall asleep during a fake armed robbery training exercise at a shop in Thailand. A CCTV clip of the training exercise uploaded on Facebook shows the Husky named Lucky snoozing as an ‘armed robber’ confronts the jewelry store owner at ‘gunpoint’.

ITEMVIDEOS: కుక్కను తిట్టిపోస్తున్న నెట్ జనులు.. ఎందుకో తెలుసా.?

Posted: 03/01/2021 05:22 PM IST
Guard dog takes a quick snooze during a mock drill in thailand

బంగారు నగల వ్యాపారితో పాటు ఆయన దుకాణానికి కాపలాగా ఉన్న ఓ కుక్కను నెట్ జనులు తిట్టిపోస్తున్నారు. నీ పని నువ్వు చేయకండా.. నీ జాతి కుక్కలకే అవమానాన్ని ఆపాదించిపెట్టావు అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. ఎందుకలా అంటే ఆ కుక్క కాపాలాగా వున్న బంగారు ఆభరణాల దుకాణంలో దొంగ పడి.. బంగారాన్ని మూటకట్టుకుని దోచుకెళ్తుంటే.. అ దుకాణంలోనే ఓ పక్కగా వున్న శునంక దొంగను చూసి అరవటం.. మరో అడుగు ముందకసీ దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడాల్సింది పోయి.. గురకలు పెట్టి నిద్రపోయింది.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌, చియాంగ్‌ మాయ్‌ సిటీలోని ఓ బంగారం షాపులోకి నెత్తిన నల్ల టోపీ, మూతికి మాస్క్‌తో ఓ దొంగ చొరబడ్డాడు. యజమానికి గన్ను చూపించి, బెదిరించి బంగారు నగలున్న సంచిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే షాపునకు కాపలాగా ఉన్న కుక్క మాత్రం ఇదేమీ పట్టనట్లు గురకపెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ దొంగ మళ్లీ షాపు దగ్గరకు వచ్చాడు. జరిగిందంతా ఓ నకిలీ దొంగతనమని, షాపుల్లోని భద్రతను పరీక్షించటానికి పోలీసులు ఏర్పాటు చేసిన మాక్‌ డ్రిల్‌లో భాగంగా దొంగతనానికి వచ్చానని చెప్పాడు.

దీంతో ఒకవేళ షాపులో నిజమైన దొంగతనం జరిగినప్పుడైనా కుక్క మేలుకుంటుందా అని పోలీసు దుకాణ యజమానిని ప్రశ్నించాడు. షాపు యజమాని దీనికి సమాధానం ఇస్తూ.. ‘‘ నిజం చెప్పమంటారా?.. నా ఉద్ధేశ్యంలో మా కుక్క మనుషుల భాషను అర్థం చేసుకుందని అనుకుంటున్నా. అది ఎప్పుడూ చాలా హుషారుగా ఉంటుంది. నేను ఏ  చిన్న శబ్ధం చేసినా ఊరుకోదు. మీరు సీసీటీవీ కెమెరాల్లో నా హావభావాలను గమనించండి. నేనేమైనా శబ్ధం చేశానేమో చూడండి! అది ఫేక్‌ అని నాకు తెలిసిపోయింది కాబట్టే నేను ఊరికే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చాడు.

నిజమైన దొంగలు దుకాణంలోకి ప్రవేశించిన తీరు..వారు పడే కంగారు మీలో కనబడలేదని పోలీసుకు సూచించిన దుకాణ యజమాణి.. ఇక తన కుక్కను ఏవ్వరూ ఏమనకుండా వెనకోసుకువచ్చాడు. అయితే దొంగ వేషంలో వచ్చిన పోలీసుకు ఆ కుక్క అంతకు ముందే తెలుసునని, చాలా సార్లు కలుసుకున్నారని షాపు యజమాని చెప్పాడు. ఏది ఏమైనా కుక్క అలా గుర్రుపెట్టి నిద్రపోవటంపై నెటిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ తెలిసిన వ్యక్తులు షాపును దోచుకుపోతే చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ షాపులో దొంగ పడితే అలా గురకపెట్టి నిద్రపోతావా.. సిగ్గులేదు?’’ అంటూ మండిపడుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles