Palaniswami represents Modi, not Tamil Nadu విద్యార్థితో బస్కీలు తీసి.. డాన్స్ చేసిన రాహుల్ గాంధీ

Watch rahul gandhi dances does push ups with school kids in tamil nadu

rahul gandhi dance video, rahul gandhi school students dance, rahul gandhi push ups, rahul gandhi tamil nadu visit, tamil nadu assembly election, tamil nadu elections, rahul gandhi tamil nadu CM, rahul gandhi kanyakumari, rahul gandhi tamil nadu, rahul gandhi kanyakumari news, Tamil nadu assembly election rahul gandhi, Rahul Gandhi Tamil Nadu, Tamil Nadu, Politics

Congress leader Rahul Gandhi visited a school during his Tamil Nadu tour. He visited a school in Mulagumoodu and interacted with the students. Rahul Gandhi also showcased his dancing skills during the school tour. He partnered a few students of St. Joseph's Matriculation Higher Secondary School on the stage for a group dance. The Congress leader also competed with a student for a round of push-ups.

ITEMVIDEOS: విద్యార్థితో బస్కీలు తీసి.. డాన్స్ చేసిన రాహుల్ గాంధీ

Posted: 03/01/2021 06:27 PM IST
Watch rahul gandhi dances does push ups with school kids in tamil nadu

కాంగ్రెస్‌ అగ్రనేత రాహు‌ల్ ‌‌గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో పాటు సముద్రంలోకి దూకీ.. సుమారు పది నిమిషాల పాటు ఈత కొట్టారు. ఇక పొరుగున్న తమిళనాడులోనూ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్ గాంధీ బిజీగా పర్యటించడంతో పాటు మరీ ముఖ్యంగా కొత్త ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక్క కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్.. ఆయా రాష్ట్రాల్లో గెలుపును కైవసం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అస్సోం మినహా మూడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల బాద్యతలను తనపై వేసుకున్న రాహుల్ గాంధీ ఈ నాలుగు ప్రాంతాల్లో విపరీతంగా ప్రచరం చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ కొ్త్త ఓటర్లను తనవైపు ఆకర్షించేందుకు తమ పార్టీకి వారి ఓట్లును మార్చుకుని కీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈనేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలతో మమ్మేకమై వారికి చేరువవుతున్నారు, తమిళనాడులోని కన్యాకుమారీలో పర్యటించిన ఆయన ములగుమూడుబన్‌ ప్రాంతంలోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థులతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తనతో పాటు బస్కీలు తీస్తారా అని అడగ్గా.. రాహుల్‌ అందుకు అంగీకరించి విద్యార్థితో కలసి బస్కీలు తీశారు. విద్యార్థిని కంటే వేగంగా బస్కీలు తీసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను రాహుల్‌ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అంతకు ముందు ఇక్కడి విద్యార్థులతో కలిసి రాహుల్‌ కాసేపు సరదాగా డ్యాన్స్‌ చేశారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపి ప్రభుత్వాన్ని గద్దె దించడం కఠినమైన విషయం కాదని రాహుల్ గాంధీ అన్నారు. రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతూ వాహనదారులకు చుక్కులు చూపుతున్నాయని రాహుల్‌ విమర్శించారు. ప్రధాని మోదీ కన్నా అత్యంత శక్తివంతమైన అంగ్లేయులనే దేశ ప్రజలు తరిమికోట్టారని.. ఆయనఅన్నారు. ప్రధాని మోడీ అంగ్లేయుల కన్నా శక్తివంతమైన వ్యక్తి కాదని అన్నారు. ఇక డబ్బు, అధికార ప్రభావంతో రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలోనూ.. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశప్రజలు తిరగబడే రోజు వస్తుందని అన్నారు.  

‘‘కేంద్ర ప్ర‌భుత్వం త‌మిళ‌ సంస్కృతిని గౌర‌వించ‌దు. తమిళుల ప్ర‌తినిధిలా వున్న ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి.. కేంద్రం అదేశాలను అమలుపర్చడం తప్ప ఏమీ చేయర’’ని మండిపడ్డారు. ‘‘మోదీ ముందు త‌లవంచే వారు త‌మిళ‌నాడుకు ప్రాతినిధ్యం వ‌హించలేరు' అని రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'త‌మిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవ‌మానించే అవ‌కాశాన్ని ముఖ్య‌మంత్రి ఇవ్వ‌కూడ‌దు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చ‌రిత్ర అని మోదీ అంటారు. మ‌రి త‌మిళం భార‌తీయ భాష కాదా? త‌మిళ చ‌రిత్ర భార‌త చ‌రిత్ర కాదా? ఒక భార‌తీయుడిగా త‌మిళ సంస్కృతిని కాపాడ‌డం నా విధి' అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles