Mehul Choksi's citizenship has not been revoked మెహుల్ చోక్సీ అంటిగ్వా పౌరసత్యం రద్దు కాలేదు: న్యాయవాది

Mehul choksi s citizenship has not been revoked by antiguan civil court

mehul choksi, mehul choksi citizenship, mehul choksi antigua, mehul choksi antigua citizenship, mehul choksi extradition, nirav modi, nirav modi extradition, antigua citizenship, Antiguan civil court, Antiguan Prime Minister Gaston Browne, advocate Vijay Aggarwal, crime news

Amid reports of Mehul Choksi's citizenship being revoked by an Antiguan civil court, his lawyer has clarified that the fugitive diamantaire continues to be an Antiguan citizen. "My client Mehul Choksi has clarified that he is very much an Antiguan citizen. His citizenship has not been revoked," advocate Vijay Aggarwal was quoted as saying by ANI.

మెహుల్ చోక్సీ అంటిగ్వా పౌరసత్యం రద్దు కాలేదు: న్యాయవాది

Posted: 03/01/2021 04:02 PM IST
Mehul choksi s citizenship has not been revoked by antiguan civil court

పంజాబ్ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే కేసులో మరో కీలక నిందితుడైన, నీరవ్‌మోదీ మేనమామ, డైమండ్‌ వ్యాపారి మెహుల్ చోక్సీ విషయంలో తెరపైకి వచ్చిన ఓ వార్తలో అసలు నిజం లేదని అతని తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు. చోక్సీ ఇప్పటికే అంటిగ్వన్ పౌరసత్వాన్ని కలిగివున్నాడని ఆయన స్పష్టతను ఇచ్చారు.

వేలకోట్ల రూపాయల మేర పీఎన్‌బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్‌ బార్బుడా రద్దు చేసిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ అగర్వాల్ ఈ మేరకు ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఆయన దేశ పౌరసత్వం రద్దు కాలేదని, ఆయన ఇంకా అంటిగ్వా పౌరసత్వం కలిగి ఉన్నాడని న్యాయవాది వివరణ ఇచ్చారు. చోక్సీ అంటిగ్వా పౌరసత్యాన్ని అంటిగ్వా సివిల్ కోర్టు ఏడాది క్రితమే రద్దు చేసిందని వస్తున్న వార్తలను అయన తోసిపుచ్చారు.

గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్ లో‌ని సివిల్ కోర్టును ఆశ్రయించాడు చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటాన్ని అంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ ను భారత్ అప్పగిస్తామని హామి కూడా ఇచ్చారు. దీంతో చోక్సీని భారత్ కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. అంటిగ్వా ప్రధాని, అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చోక్సీ పిటిషన్ ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles