TDP President Chandrababu Naidu Detained రేణిగుంట విమానాశ్రయంలో నేలపై భైఠాయించిన చంద్రబాబు

Tdp chief naidu squats at renigunta airport in protest as cops deny entry into tirupati

Chandrababu Naidu detained at Renigunta Airport, TDP supremo N Chandrababu Naidu, Renigunta airport High drama, chittor district Tdp president, Pulivarthi Venakatamani Prasad, Urban Local Bodies elections, Renigunta, Renigunta Airport, TDP, YSRCP, Andhra Pradesh, Politics

Opposition leader and TDP chief N Chandrababu Naidu was reportedly detained at Tirupati airport in Renigunta while he was on his way to Tirupati and Chittoor towns to stage a protest against the alleged excesses of the ruling YSRC leaders on the TDP cadre to withdraw their nominations from the ensuing elections to Urban Local Bodies in Andhra Pradesh.

ITEMVIDEOS: రేణిగుంట విమానాశ్రయంలో హై-డ్రామా.. నేలపై భైఠాయించిన చంద్రబాబు నిరసన

Posted: 03/01/2021 02:23 PM IST
Tdp chief naidu squats at renigunta airport in protest as cops deny entry into tirupati

రేణిగుండ విమానాశ్రయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో భాగంగా చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నిరసనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పాల్గొనాల్సి వుండటంతో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక బయటకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పర్యటనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పద్నాలుగేళ్లు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.. ప్రతిపక్ష నేతగా వున్న తనను కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తిరుపతి ఎస్పీ, కలెక్టర్‌ను కలిసి తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలుసుకుంటానని చంద్రబాబు చెప్పినా.. పోలీసులు అనుమతించలేదు. పర్యటనకు ఎందుకు వచ్చానో.. తననెందుకు ఎయిర్‌పోర్టులో నిలిపేశారో మీడియాకు వివరిస్తానని చెప్పినా పోలీసులు అందుకు నిరాకరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని అందులో పేర్కొన్నారు. చంద్రబాబు తలపెట్టిన పర్యటన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేలా ఉందని వెల్లడించారు. దీంతో ఆయన విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో తాను ఎన్నికల కమీషన్ నుంచి అనుమతి తీసుకున్న తరువాత కూడా తనను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోడవం.. పోలీసులతో తన గొంతును నొక్కాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరి  చర్యగా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని.. తమ గొంతు నొక్కలేరని ట్విటర్‌ వేదికగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. భయపెట్టి ఎన్ని రోజులు పాలన సాగిస్తారని ప్రశ్నించారు. జగన్‌ ఇంకా రాజకీయ పరిణతి సాధించాలని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles