అత్యంత శక్తివంతమైన దేశ ద్రోహ చట్టం వినియోగంపై ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అతిశక్తివంతమైన ఈ చట్టాన్ని దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వినియోగించాలే తప్ప.. ప్రభుత్వం, పోలీసుల తప్పులను ఎత్తిచూపుతున్న వారి గొంతు నొక్కడానికి కాదని వ్యాఖ్యానించింది. సమాజంలో తమను ఎదురించే వారందరిపై ఈ చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేయడం మంచిది కాదని హితవు పలికింది. దుండగుల ముసుగులో ఆ చట్టం ప్రయోగించడం సహేతుకం కాదని పేర్కోంది. దేశద్రోహం చట్టాన్ని పేర్కోని పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు.. తమకు బెయిలు మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.
ఢి్ల్లీ శివారల్లో వ్యవసాయ చట్టాలను కేంద్రం తక్షణం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి మద్దతుగా దేవీ లాల్ బర్దక్, స్వరూప్ రామ్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేస్తున్నారని, ఫేక్ వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తున్నారని పేర్కొంటూ పోలీసులు వారిద్దరిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు నమోదు చేసిన కేసులపై పోరాడుతున్న వీరిద్దరూ తమకు బెయిలు మంజూరు చేయాలని ఢిల్లీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాన్ని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా విచారించారు.
సాగు చట్టాల ఆందోళనలకు సంబంధించి హింసను ప్రేరేపించేందుకు వారు ప్రయత్నించారని చె్ప్పడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాల్లేవని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారన్న పోలీసుల వాదనలకు సరైన ఆధారాలను కూడా చూపించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాబట్టి వారిపై దేశద్రోహ చట్టాన్ని తప్పుగా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. వారిద్దరి మీదా తప్పుడు కేసులు బనాయించినట్టు అర్థమవుతోందని పేర్కోంది. ఈ కేసుపై లోతైన చర్చ జరగాలన్నది తన అభిప్రాయంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రైతు ఉద్యమానికి మద్దతుగా 200 మంది పోలీసులు రాజీనామా చేశారంటూ ఓ వీడియోను వారిద్దరూ పోస్ట్ చేశారని, వాస్తవానికి పరిస్థితులను ఎలా డీల్ చేయాలో సిబ్బందికి ఆ వీడియోలో పోలీస్ అధికారి సూచిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే, దానికి స్పందించిన జడ్జి.. తానే స్వయంగా కోర్టు రూములో ఆ వీడియో చూశానన్నారు. అందులో రైతులకు అనుకూలంగా ఆ పోలీస్ అధికారి నినాదాలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అక్కడి వాతావరణం కూడా అలాగే ఉందన్నారు. అయితే, ఆ వీడియోను ఒరిజినల్ గా పోస్ట్ చేసింది నిందితులు కాదని, కేవలం ఫార్వర్డ్ మాత్రమే చేశారని దర్యాప్తులో తేలినట్టు గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more