ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గత రెండు విడతల్లో లేని విధింగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఉదయం ఆరు గంటల నుంచి పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 10.30 గంటల సమాయానికి రమారమి 40శాతానికి పైన ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3221 గ్రామ పంచాయతీల్లో 579 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, 2639 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఏకంగా 19,553 వార్డులకు సభ్యులను ఓట్లర్లు ఎన్నుకోనున్నారు. ఇక పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని మూడు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ వేయలేదు.
నోటిఫికేషన్ ఇచ్చిన 3,221 గ్రామ పంచాయతీల్లో 579 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో జరుగుతున్న మూడో విడత ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. తమ రెండు విడతల్లో లేని విధంగా ఈ సారి ఎన్నికలలో ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవనిగడ్డలో స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, చల్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే సాటూరురామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇటు గుంటూరు జిల్లాలో ఎన్నికల అధికారులు పోరబాటుతో పోలింగ్ నిలిచిపోయింది. జిల్లాలలోని గురజాల మండలం మాడుగులలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే గుర్తు ముద్రించినట్టు పోలింగ్ ప్రారంభమైన తరువాత గుర్తించడంతో అధికారులు మాడుగులలో 12, 13 వార్డులలో పోలింగ్ నిలిపివేశారు, ఈ నెల 21న ఈ వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలి సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. ఆయనపై పాత కేసులు వున్నాయని పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అయితే అభ్యర్థిగా ఆయన హక్కును పోలీసులు హరించారని సర్పంచ్ అభ్యర్థి అనుయాయువులు అరోపిస్తున్నారు.
ఇటు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఎంపీ రెడ్డప్ప పర్యటించడంపై వివాదం రాజుకుంది. మండలంలోని వెండుగంపల్లె, గోనుగూరు పంచాయతీల్లో పర్యటిస్తున్న ఆయనపై టీడీపీ నాయకులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన పర్యటనలు వున్నాయని.. అయినా ఎన్నికల సమయంలో స్థానికేతరుడు పర్యటించడంపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘం అధికారులకు పిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో చింతూరు మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారిణి దైవకృపావతికి గుండెపోటు వచ్చింది. అమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన కాకినాడ అసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అమె చికిత్స పోందుతూ మరణించారు.
ఉదయం 10.30 గంటలకు రాష్ట్రంలో ఏకంగా 40.29 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారిగా పరిశీలిస్తే.. విజయనగరం జిల్లాలో ఓటర్లు మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికలలో మంచి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఏకంగా ఉదయం 10.30 గంటలకు ఇక్కడ యాభైశాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఆ తరువాత విశాఖపట్నం జిల్లాలోనూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోటీపడ్డారు. ఉదయం 10.30 గంటలకు ఇక్కడ 43శాతం మేర పోలింగ్ నమోదైంది. అదే అదే సమయంలో ఉత్తరాంధ్రకు చెందిన మరో జిల్లా శ్రీకాకుళంలోనూ ఓటర్ల తమ హక్కును వనియోగించుకునేందుకు పోటీ పడ్డారు. ఉదయం 10.30 గంటలకు కేవలం 42.65శాతం మేర పోలింగ్ జరిగింది.
ఇక ఉభయ గోదావరి జిల్లాలోనూ ఓటర్లు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఉదయం 10.30 గంటలకు తూర్పు గోదావరిలో 34.51శాతం.. పశ్చిమ గోదావరిలో 31.06శాతం పోలింగ్ నమోదైంది. ఇటు గుంటూరు జిల్లాలోనూ ఓటర్లు పోటీ పడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10.30 గంటలకల్లా ఇక్క ఏకంగా 33శాతం పోలింగ్ నమోదైంది. తూర్పులో 33.52శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ గోదావరిలో 32 శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయంలో కృష్ణా జిల్లాలోనూ ఓటర్లు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వేసుందుకు బారులు తీరారు. ఇక్కడ ఉదయం 10.30 గంటల వరకు 38.35 శాతం మేర పోలింగ్ నమోదయ్యేలా చేశారు.
అటు ప్రకాశం జిల్లాలోనూ ఉదయం 10.30 గంటల వరకూ 36 శాతం మేర ఓటింగ్ నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 42.16 శాతం, అదే సమయంలో రాయలసీమ జిల్లాల్లో ఓటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇక్కడ ఓటర్లు హుషారుగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కర్నూలు జిల్లాలో ఉదయం 10.30 గంటల సమయానికి ఏకంగా 49శాతం పోలింగ్ నమోదు కాగా, అనంతపురంలో 48.15శాతం నమోదైంది. ఇక వైఎస్సాఆర్ కడప జిల్లాలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇక్కడ ఉదయం 10.30 సమయానికి 31.73శాతం నమోదు కాగా.. చిత్తూరులోనూ ఆశించిన మేర ఓటరులో ఉత్సాహం కోరవడింది. ఇక్కడ కేవలం 30.59శాతం నమోదైంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10.30 గంటలకు 40.29శాతం పోలింగ్ నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more