Kiran Bedi’s Sudden Removal As Lieutenant Governor పుదుచ్చేరి గవర్నర్ పదవికి కిరణ్ బేడీ వీడ్కోలు..

Whatever was done was a sacred duty kiran bedi s farewell note

Kiran Bedi removed as puducherry governor, Telangana governor tamil sai to take additional charges, Kiran Bedi, Lieutenant-Governor, Farewell Note, V Narayansamy, Chief Minister, Rashtrapatibhavan, Pondy, Pondicherry, Kiran Bedi, Congress Puducherry, Tamila sai, Telangana governor, Politics

Kiran Bedi thanked the government for a "life time experience" as the Lieutenant-Governor of Puducherry, after she was removed from the top post last night amid a crisis in the ruling Congress government in the union territory. The Congress government has slipped into a minority after four Congress leaders resigned from the Assembly since last month.

గవర్నర్ పదవికి కిరణ్ బేడీ వీడ్కోలు.. సోషల్ మీడియాలో లేఖ..

Posted: 02/17/2021 01:17 PM IST
Whatever was done was a sacred duty kiran bedi s farewell note

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా గత నాలుగున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగిన ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని కేంద్రం అఘమేఘాల మీద పదవి నుంచి తొలగించింది. అయితే సరిగ్గా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిన రోజునే అమెను లెప్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కేంద్రం తప్పించింది. దీంతో రాజ్యాంగ పరమైన పదవిలో తన విధుల్ని నైతిక విలువలతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించానని కిరణ్‌బేడీ అన్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా కిరణ్ బేడీని తొలగిస్తూ కేంద్రం క్రితం రోజున నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె ఇవాళ తన వీడ్కోలు లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో తన విధుల్ని.. విలువలతో బాధ్యతాయుతంగా నిర్వర్తించానని అమె పేర్కోన్నారు. పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా అవకాశం కల్పించి తనకు జీవితకాల అనుభవాల్ని అందించేలా చేసిన కేంద్ర ప్రభుత్వానికి అమె ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన టీమ్ రాజభవన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా ప్రయోజనాల కోసం రాజ్ భవన్‌ సిబ్బంది ఉన్నతంగా కృషి చేశారు. పుదుచ్చేరి భవిష్యత్తులోనూ అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కిరణ్‌బేదీ లేఖలో పేర్కొన్నారు.

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా ఉన్న కిరణ్‌బేదీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలగించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా కిరణ్‌బేదీకి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామికి మధ్య తొలి నుంచే ఉద్రిక్త వాతావరణం ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles