Ghatkesar rape case culprits are dangerous than disha criminals ఘట్ కేసర్ దారుణం: మత్తుమందు ఇచ్చి.. గ్యాంగ్ రేప్..

Ghatkesar horror culprits used code word to abduct and rape

b pharmacy student, b pharmacy student kidnapped, b pharmacy student abduction, b pharmacy student keesara, b pharmacy student ghatkesar, auto driver, another disha case, jodimetla, abduction, attempt rape, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

The Rachakonda police in Hyderabad informed that a pharmacy student who was abducted, was also sexually assaulted. A 19-year-old female student returning from college was abducted by an auto driver. The driver and three of his accomplices assaulted her in the outskirts of Hyderabad.

ఘట్ కేసర్ దారుణం: గట్టిగా నోరు మూసి.. మత్తుమందు ఇచ్చి.. గ్యాంగ్ రేప్..

Posted: 02/12/2021 02:26 PM IST
Ghatkesar horror culprits used code word to abduct and rape

ఘట్ కేసర్ లో బీఫార్మసీ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఏకంగా ఆరుగురు నిందితులు దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిందరినీ రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అత్యాచారం నేపథ్యంలో బాధితురాలికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.

రాంపల్లి ఆర్.ఎల్‌. నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని మేడ్చల్ లోని తన కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని కాలేజీ బస్సు దిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్తేందుకు అటోను ఆశ్రయించింది. అయితే సత్యనారాయణ నగర్ వద్ద అటోలోని ప్యాసెంజర్లు దిగిన తరువాత.. కొద్ది దూరంలోనే అమె దిగాల్సిన ఆర్ఎల్ నగర్ స్టాపు వచ్చినా.. అటోను అపకపోవడంతో కంగారు పడిన బాధితురాలు తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని సిగ్నల్ ఆధారాంగా అపస్మారక స్థితిలో వున్న అమెను అసుపత్రికి తరలించారు. పోలీసు వాహనాల సైరస్ విన్న నిందితుతు పారిపోయారు.

కాగా, నిందితుల్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన 10 ప్రత్యేక బృందాలు ముందుగా నాగారం సర్కిల్ లోని ఓ సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఆ విద్యార్థిని ఎక్కిన సెవెన్‌ సీటర్‌ ఆటోను గుర్తించారు. దాని డ్రైవర్‌తో పాటు ఈసీఐఎల్, రాంపల్లి, యంనంపేట్, ఘట్‌కేసర్‌ మార్గాల్లో నడిచే ఆటోల డ్రైవర్లలో అనేక మందిని విచారించడంతో పాటు ఘటనాస్థంలోని సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి సేకరించిన సాంకేతిక అంశాలు, నిర్దేశిత లొకేషన్లలో ఉన్న సెల్‌ఫోన్‌ నెంబర్ల ఆధారంగా నిందితులందరూ యంనంపేట్‌ ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. వీరిలో కొందరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.

మొత్తం ఆరుగురు నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్ ను తో పాటు బాధితురాలిని అపహరించేందుకు వినియోగించిన ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వీరిని ఘటనాస్థలికి తీసుకెళ్లి ప్రాథమిక క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహించారు. ఈ కేసులో నిందితులు పక్కగా తమకు కావాల్సిన వారిని టార్గెట్ చేసి.. వారిని పక్షం రోజుల పాటు అబర్వేషన్ చేసిన తరువాత పక్కగా స్కెచ్ వేసి.. అవకాశం కోసం వేచి చూస్తారని.. అవకాశం దక్కగానే కోడ్ వర్డ్ ను స్నేహితులకు చేరవేసి ప్లాన్ అమలుపరుస్తారని తెలుస్తోంది.

ఇలాగే ఆర్ఎల్ నగర్ వద్ద దిగాల్సిన బాధితురాలైన ఫార్మసీ విద్యార్థిని.. అటో ఆపకుండా.. అమె అరవకుండా గట్టిగా నోరు మూసివేసి.. కదలకుండా అమెను పట్టుకుని యంనంపేట ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ అమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డారు. అయితే మత్తు మందు ఇచ్చినా బాధితురాలు తనపై జరుగుతున్న దారుణాన్ని అడ్డుకోవడానికి యత్నించడంతో అమెపై బలంగా దాడికి కూడా చేశారు. కాగా, బాధితురాలు తమ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆమె స్పృహలో లేదని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బాధితురాలికి అంతర్గతంగా గాయాలు ఉన్నాయని, తల, కాలిపై గాయాలు ఉన్నాయని, కర్రలు లేదా రాడ్లతో దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh