Flying within India to cost up to 30% more దేశీయ విమానయానం ఇక ప్రియం..

Flight fare hike air travel to be costlier as govt raises fare limits by up to 30 per cent

Airfare hiked, domestic airfare, airfare hiked,: Flying within India to cost up to 30% more, air fare, air fare hike, flight fare hike, aviation industry, travel to get costlier, domestic flights, airfare, Hardeep Puri, Civil aviation

Air travel is likely to be costlier as the Ministry of Civil Aviation has increased the minimum and maximum cap on fares across all bands. The limits on airfares have been increased by 10-30 per cent, the ministry said in a notification

మధ్యతరగతికి అందని ద్రాక్ష: దేశీయ విమానయానం ఇక ప్రియం..

Posted: 02/12/2021 12:28 PM IST
Flight fare hike air travel to be costlier as govt raises fare limits by up to 30 per cent

దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియంగా మారాయి. ఉడాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు విమానాల్లో ప్రయాణం చేయని వారెందరినో విమానం ఎక్కేలా చేసామని చెప్పుకుంటున్న కేంద్రప్రభుత్ం మరోమారు విమానం కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం అన్నట్లగా తేల్చేసింది. అదెలా అంటే దేశీమ విమానయాన టికెట్ ధరలను అమాంతం పెంచేసి.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలి అనుకుని ఆశపడుతున్న మధ్య తరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. దేశీయ విమానచార్జీలను ఏకంగా పది నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది.

గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ ఏడాది మార్చి 31 వరకు , లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. సవరించిన చార్జీల ప్రకారం.. ప్రయాణకాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 1,800 వరకు, 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ కాలానికి రూ. 300-రూ. 2,700, 90 నిమిషాల వరకు ఉంటే రూ. 300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల వరకు ఉండే ప్రయాణకాలానికి కనిష్టంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ. 2,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ప్రయాణ కాలం  90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ. 400-రూ. 3వేలు, ప్రయాణ కాలం 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ. 500-రూ.3,900,  150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉండే ప్రయాణ కాలానికి కనిష్ఠంగా రూ. 600 నుంచి గరిష్ఠంగా రూ. 4,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్ఠంగా రూ. 700 నుంచి గరిష్ఠంగా రూ. 5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles