Ghatkesar rape case culprits are dangerous than disha criminals ఘట్ కేసర్ మానవమృగాలు.. కోడ్ వర్డ్ తో నిమిషాల్లో స్కెచ్.!

Ghatkesar rape case culprits used code word to abduct and rape

b pharmacy student, b pharmacy student kidnapped, b pharmacy student abduction, b pharmacy student keesara, b pharmacy student ghatkesar, auto driver, another disha case, jodimetla, abduction, attempt rape, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

Ghatkesar Rape case culprits are dangerous than disha criminals as they used to code word to abduct the victims and would gang rape them.

వారిని మించిన ఘట్ కేసర్ మానవమృగాలు.. కోడ్ వర్డ్ తో నిమిషాల్లో స్కెచ్.!

Posted: 02/12/2021 11:28 AM IST
Ghatkesar rape case culprits used code word to abduct and rape

శంషాబాద్ లో చోటుచేసుకున్న దిశ ఘటనలో నిందితుల కన్నా కరుడుగట్టిన నేరగాళ్లు ఘట్ కేసర్ అత్యాచార ఘటనలో నిందితులు. అత్యాచార ఘటనలో వీరిని అదుపులోకి తీసుకన్న పోలీసులు.. వారిని విచారించడంలో విస్తుపోయే నేరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తమ పరువు కోసం భయపడిన మధ్యవర్గాలకు చెందిన కుటుంబాల భయన్నే అసరాగా చేసుకుని నిందితులు నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒంటరిగా కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలను టార్గెట్ గా చేసుకుని వీరు నేరాలకు పాల్పడుతున్నారన్న వివరాలు భయటకు వచ్చాయి.

ఒంటరి యువతులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని పక్షం రోజుల పాటు గమనించిన తర్వాత వారిని అపహరించేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటారు. ఇక వారికి కావాల్సినదల్లా వారు అటోలో ఎక్కడమే.. అంతే అటోలోకి ఎక్కారా.. వారి కామవాంఛకు ఎక్కిన వారు బలికావాల్సిందే. ఇక వారి స్కెచ్ ఎలా సాగుతుందంటే.. ప్రయాణికులు మార్గమధ్యంలో దిగిపోగానే.. వారి స్కెచ్ అమల్లోకి వస్తుంది. మార్గమధ్యంలో ప్రయాణికుల మాదిరిగానే ఇద్దరు స్నేహితులు అటోలో ఎక్కుతారు. అక్కడి నుంచే బాధితురాలి అపహరణ ప్రారంభమవుతుంది.

అయితే ఇంతటి పకడ్భంధీగా స్కేచ్ వేసుకున్న ఈ కరుడుగట్టిన నేరగాళ్లు.. అటోలో తాము టార్గెట్ చేసిన వారు ఎక్కిన వెంటనే.. కోడ్ వర్డ్ తో తన మిత్రులకు ఫోన్ చేస్తారు. ఇంతకీ వారు వినియోగించిన కోడ్ వర్డ్ ఏంటో తెలుసా.. మ్యాటర్ రెడీ. ఇలా బాధితురాళ్లతో నగరశివార్లోని ప్రాంతాలకు వెళ్లగానే ఘట్‌కేసర్‌కు సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్ద మరో స్నేహితుడు వ్యాన్‌తో వేచి ఉంటాడు. ఇక సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని బెదిరించి సామూహికంగా అత్యాచారానికి పాల్పడేవారు. ఎదురు తిరిగితే విచక్షణారహితంగా కొట్టి అఘాయిత్యం చేసేవారు. మరో నలుగురిపై ఇలాగే అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles