9 dead in crashes across Dallas-Fort Worth 9 మంది ప్రాణాలను బలిగొన్న మంచుతుఫాన్..

At least 9 dead in crashes across dallas fort worth area due to winter storms

US, Texas winter storms, Fort Worth pile-up, 9 dead in crashes, Dallas-Fort Worth area, winter weather advisory, winter storms, America, crime

At least nine people have died in car crashes due to winter storms across the Dallas-Fort Worth area of Texas, according to a count by CNN. A 133-car pileup on Interstate 35 West in Fort Worth left at least six people dead, according to Fort Worth Police Chief Neil Noakes. The pileup was reported around 6 a.m. CT and spanned roughly a mile.

అగ్రరాజ్యంలో మంచుతుఫాన్ బీభత్సం.. వంద వాహనాలు ఢీ.. 9 మంది మృతి

Posted: 02/12/2021 10:45 AM IST
At least 9 dead in crashes across dallas fort worth area due to winter storms

 అమెరికాలో టెక్సాస్ నగరంలో కురిసిన మంచు ఏకంగా తొమ్మిది మందిని అసువులను తీయడంతో పాటు.. అనేక మందిని క్షతగాత్రులను చేసింది. పదుల సంఖ్యలో వాహనాలను కూడా ధ్వంసం చేసింది. మంచుతుఫాన్ కారణంగా సంభవించిన డాల్లస్ లోని ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. మంచు తుపాన్ కారణంగా వాహనాల టైర్లు పట్టుకోలే్పోయిన వాహనాలు ఫోర్ట్ వర్త్ వద్ద ఒకదానికి మరోకటి ఢీకొనడంతో ప్రమాదం సంభివించింది.

ఈ ప్రమదంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 వాహనాలు.. ఒకదానినొకటి ఢీకొని మైలున్నర మేర చిందరవందరగా పడిపోయాయి. దీంతో మైళ్ల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన మంచు తుపానుతో రహదారిపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి ఈ ప్రమాదానికి దారితీసింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫోర్త్విత్ సమీపంలో 35వ అంతర్రాష్ట్రీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది ఒక్కో వాహనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులోని వారిని బయటకు తీసి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలిస్తున్నారు. చాలా వరకు వాహనాలు నుజ్జునుజ్జయి పోయాయి. జారుడుగా ఉన్న ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు సహాయక సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుందని యంత్రాంగం తెలిపింది. ఫెడ్ ఎక్స్ కు చెందిన ట్రక్కు ఒకటి అదుపుతప్పి బారియర్ ను ఢీకొని ఆగిపోయింది.

వెనుకే వచ్చిన మరికొన్ని కార్లు ఆ ట్రక్కును ఢీకొని నిలిచిపోవడంతో ఈ ప్రమాదాల పరంపర మొదలైనట్లు భావిస్తున్నారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రహదారిపై ప్రమాద దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంతో రహదారిపై పేర్చుకుపోయిన వాహనాలను పోలీసులు క్లియర్ చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో షిర్లీ మంచు తుపాను కారణంగా∙జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. తుపాను ప్రభావంతో కెంటకీ వెస్ట్ వర్జీనియాల్లోని సుమారు 1.25 లక్షల నివాసాలు వాణిజ్యప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  Texas  winter storms  Fort Worth pile-up  Dallas-Fort Worth  winter storms  America  crime  

Other Articles