Maharashtra Governor denied flight to Dehradun మహారాష్ట్ర గవర్నర్ విమానానికి అనుమతివ్వని ఉద్దవ్ సర్కార్

Maharashtra cm says no to governor koshyari for use of vvip aircraft

Uttarakhand, Bhagat Singh Koshyari, maharashtra guv, dehradun, Uddhav Thackeray, Shiv Sena, Ajit Pawar, Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai, Kangana Ranaut, Maharashtra, National Politics

The bitter tussle between the Uddhav Thackeray-led Maha Vikas Aghadi dispensation and Maharashtra Governor Bhagat Singh Koshyari came out in the open yet again on Thursday when the latter was denied permission to fly in a state government plane to Dehradun.

మహారాష్ట్ర గవర్నర్ విమానానికి అనుమతివ్వని ఉద్దవ్ సర్కార్

Posted: 02/11/2021 06:03 PM IST
Maharashtra cm says no to governor koshyari for use of vvip aircraft

మహారాష్ట్రలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దేశంలోని బీజేపి యేతర రాష్ట్రాల్లోనూ తమ మార్కు పాలన సాగేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తీవ్ర అవమానం ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఏర్పాటైన తరువాత నుంచి అటు ప్రభుత్వానికి ఇటు గవర్నర్ కార్యాలయానికి మధ్య అంతరం పెరుగుతున్నా.. ఎక్కడో రాజీ కుదురుతుందని ఆవించగా.. అది అంతకంతకూ పెరిగి పెద్దదవుతోంది.

ఏకంగా గవర్నర్ రాష్ట్ర విమానంలో ఉత్తరఖండ్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చినా ఆయన ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో ఆయన డబ్బలు పెట్టి మరో విమానంలో డెహ్రాడూన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇంతలా అటు ప్రభుత్వానికి ఇటు రాజ్ భవన్ కు మధ్య చెడింది. ఇందుకు కారణం గత అక్టోబరు నుంచి దేశంలోని అన్ని దేవాలయాలకు, ప్రార్థనామందిరాలకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే దేశంలోనే అత్యధిక కేసులతో కాకవికలమైన మహారాష్ట్రలో అన్ లాక్ అయినా కేంద్రం అనుమతులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రార్థనాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో గవర్నర్ కోష్యారీ రాష్ట్ర ప్రభుత్వంపై అందులోనూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై విమర్శలు చేశారు. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధవ్ ఇప్పుడు లౌకికవాదిగా మారినట్టుందని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర సీఎంకు, గవర్నర్ కోష్యారీకి మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా, గవర్నర్ కు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్టుకు వచ్చిన గవర్నర్ విమానంలో ఎక్కేందుకే రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.

విమానం ఎక్కిన తర్వాత కూడా పావుగంట సేపు కూర్చున్నారు. అయితే తనకు టేకాఫ్ కు అనుమతి రాలేదంటూ ఫ్లయిట్ కెప్టెన్ చెప్పడంతో గవర్నర్ కోష్యారీ చేసేది లేక ఆ విమానం నుంచి దిగి, మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ పయనం అయ్యారు. దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని, అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles