Telangana and AP: Graduates MLC election on March 14 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మ్రోగిన నగారా..

Cec releases mlc election shedule for telangana and andhra pradesh

Palla Rajeshwar Reddy, Teachers Graduate, PRTU, Poola Ravinder, MLC Election notification, G Chinna Reddy, Ramulu Naik, N Ramachandra Rao, Mahabubnagar-Rangareddy-Hyderabad, Warangal-Khammam-Nalgonda, Telangana, Telangana Legislative Council, Graduate MLC, Teachers MLC, Andhra Pradesh Legislative Council, Andhra Pradesh, Politics

Elections for the two graduates' constituencies of the Telangana State Legislative Council will be held on March 14. The Election Commission of India announced the schedule for the polls on Thursday. The election notification will be issued on February 16.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మ్రోగిన నగారా..

Posted: 02/11/2021 02:57 PM IST
Cec releases mlc election shedule for telangana and andhra pradesh

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగరా మ్రోగింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నగారాను మ్రోగించింది. ఈ నెల 16 రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీల పక్షాన సాగనున్న ఈ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టనున్నాయి.

తెలంగాణలోని మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు ఖమ్మం-వరంగల్-నల్గోండ జిల్లాల ఉపాధ్యయ స్థానానికి మార్చి 14న పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇక ఖమ్మం-వరంగల్-నల్గోండ ఉపాధ్యాయ స్థానంలో తమ అభ్యర్థిని బలపర్చేందుకు.. పీఆర్టీయు నేత, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఈ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.

మహబూబ్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిని రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి బరిలో నిలుపుతుండగా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ను నల్గోండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యయ ఎమ్మెల్సీగా బరిలో నిలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోమారు ఇదే స్థానం నుంచి పోటీకి దిగనున్నారు. అయితే రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ నుంచి మాత్రం అభ్యర్థిని ఇంకా పార్టీ ఖరారు చేయాల్సి వుంది.

ఆంధ్రప్రదేశ్ లో..

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 23 చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘం ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలించనుంది. ఈ నెల 26వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించిన ఎన్నికల సంఘా మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 17న జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles