Farmers announce rail roko agitation on 18th Feb 18న రైల్ రోకోకు రైతన్నల పిలుపు..

Farmers protest farmers announce rail roko on feb 18 candle marches to honour pulwama bravehearts

farmers rail roko, farmers candle march, protest delhi, farmers laws farm, farmers rail roko agitation, farmers protests, farmers protests delhi border, barricades at delhi border, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, farmers tractor rally, farmers rally violent, farmers farm laws, delhi police, Intelligence bureau, supreme court committee, delhi, politics

Protesting farmers announced a four-hour nationwide rail blockade on February 18 as they renewed their strategy to intensify their agitation, which also included a candle march on February 14 in the memory of those killed in the 2019 Pulwama terrorist attack.

ఈ నెల 18న రైల్ రోకో అందోళనకు పిలుపునిచ్చిన రైతులు..

Posted: 02/11/2021 01:32 PM IST
Farmers protest farmers announce rail roko on feb 18 candle marches to honour pulwama bravehearts

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుమారు మూడు నెలలుగా నిరసనోద్యమన్ని చేపడుతున్న రైతులు తాజాగా మరో అందోళనకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న రైతులు మరోమారు దేశవ్యాప్త అందోళనకు పిలుపునిచ్చారు. ఇదివరకే రెండు పర్యాయాలు రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో ఈ సారి పంథాను మార్చి ఏకంగా రైల్ రోకోకు అన్నదాతలు పిలుపునిచ్చారు.

ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని పిలుపునిచ్చిన రైతులు.. ఈ నెల 14న పుల్వామా దాడిలో అసువులు బాసిన అమరజవాన్లకు ఘననివాళి అర్పించేందుకు క్యాండిల్ మార్చ్ ను కూడా చేపట్టనున్నట్లు ప్రకటించారు. 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రైల్ రోకో చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకున్న తరువాత తాము హస్తినను వీడి వెళ్తామని ఇప్పటికే స్పష్టం చేసిన రైతులు.. అందుకు గాను ఈ ఏడాది అక్టోబర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి సమాయాన్ని కేటాయిస్తున్నామని అన్నారు.

గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన తరువాత ఈనెల 6వ తేదీన శనివారం రోజు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భంధనం (చక్కా జామ్) చేసిన రైతులు ఇక రైల్ రోకోకు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతు తెలిపేందుకు ర్యాలీగా వస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం విమర్శలకు దారితీసింది. అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సహా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు.. రైతుల పాలిటశాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయాలని నినదిస్తూ వల్లభబాయ్ పటేల్ చెస్ట్ ఇన్ స్టిట్యూట్ వరకు చేరకున్నారు.

అక్కడి నుంచి వారు ఆర్స్ విభాగానికి చేరువవుతున్న క్రమంలో వారిపై పోలీసులు దాడి చేసి.. పలువుర్ని గాయపర్చారు. ఈమేరకు అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషకర చర్యగా అభివర్ణించింది. ఇదిలావుండగా క్రితం రోజున పార్లమెంటులోని లోక్ సభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. 76 రోజులుగా కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనోద్యమాన్ని చేపట్టినా.. ఈ క్రమంలో ఏకంగా 206 మంది రైతులు అసువులు బాసినా.. ప్రధాని మాత్రం వారి గురించి పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన పార్లమెంటు బయట మీడయాతో మాట్లాడుతూ.. ప్రధానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. రైతులకు మద్దతు తెలిపే వ్యక్తులను ప్రధాని అందోళన్ జీవి అని వ్యంగాన్ని ప్రదర్శిచగా, రైతుల నిరసనలపై అలక్ష్యం వహిస్తున్న కేంద్రప్రభుత్వం జూమ్లా జీవి అని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల బాయ్ కాట్ చేసిందని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇక ఇవాళ పంజాబ్ గాయకుడు బబ్బు మాన్ రైతుల దీక్షాస్థలికి చేరుకుని అక్కడి రైతులతో చర్చించారు. ఇదివరకు సోషల్ మీడియాలో మాత్రమే రైతులకు తన మద్దతును తెలిపిన ఆయన.. ఘాజీపూర్ శివార్లకు చేరకుని రైతులకు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రైతుల ఉద్యమాలపై తాను బాలీవుడ్ ప్రముఖులతో చర్చించేందుకు సిద్దమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles