Gadwala Vijaya Lakshmi is new GHMC mayor జీహెచ్ఎంసీ 17వ మేయర్ గా కేకే తనయ విజయలక్ష్మీ..

Keshava rao daughter gadwala vijaya lakshmi is 17th mayor of ghmc

Gadwala Vijaya Lakshmi, GHMC Mayor, Mothe Srilatha, GHMC deputy Mayor, TRS party, 17th Mayor of GHMC, Swetha Mohanthy, presiding officer, Election Observer, Sandeep Kumar Sultania, Hyderabad mayor post, Hyderabad, Telangana, Politics

Gadwala Vijaya Lakshmi, ward no. 93, Banjara Hills of Telangana Rashtra Samithi has been elected as the new mayor of Greater Hyderabad Municipal Corporation (GHMC). The mayor has been elected by show of hands. Gadwala Vijaya Lakshmi is now the 17th mayor of GHMC.

కేకే తనయకే జీహెచ్ఎంపీ పదవి.. జీహెచ్ఎంసీ 17వ మేయర్ గా విజయలక్ష్మీ..

Posted: 02/11/2021 12:25 PM IST
Keshava rao daughter gadwala vijaya lakshmi is 17th mayor of ghmc

గత కొంతకాలంగా హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నూతన నగర మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ పదవి కోసం బీజేపి తరపున అర్కేపురం డివిజన్ నుంచి ఎన్నికైన రాధా ధీరజ్ రెడ్డి నామినేషన్ వేయడంతో మేయర్ పదవికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో ఎన్నికలు జరిగిన అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మీ నగర నూతన మేయర్ గా ఎన్నికయ్యారు.

మేయర్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఎన్నికల లాంఛనంగానే మారింది. మేయర్ పదవితో పాటు డిఫ్యూటీ మేయర్ పదవులను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. డిఫ్యూటీ మేయర్ పదవికి తార్నక కార్పోరేటర్ మోతె శ్రీలత విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ 17వ మేయర్ గా విజయలక్ష్మీ త్వరలో బాధ్యతలను చేపట్టనున్నారు. విజయలక్ష్మీ రెండు పర్యాయాలు బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పోరేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటూ.. నగరా అభివృద్దికి నిర్విరామ కృషి చేస్తానన్నారు.

మేయర్ ఎన్నికకు ముందు జీహెచ్ఎంసీ నూతన కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన బాషలో ప్రమాణం చేసేందుకు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతీ అనుమతి ఇవ్వడంతో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగీష్ బాషల్లో కార్పోరేటర్లు ప్రమాణం చేశారు. ఇవాళ మొత్తంగా 149 మంది కార్పోరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 56. బీజేపికి చెందిన 47, ఎంఐఎంకు చెందిన 44, కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు వున్నారు. బీజేపికి చెందిన ఒక కార్పోరేటర్ మరణించడంలో ఒక కార్పోరేటర్ స్థానం ఖాళీగా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles