Pharmacy student kidnapped in Hyderabad కిడ్నాపర్ల నుంచి ఫార్మసీ విద్యార్థినిని కాపాడిన పోలీసులు

Pharmacy student allegedly abducted and raped attempt

b pharmacy student, b pharmacy student kidnapped, b pharmacy student abduction, b pharmacy student keesara, b pharmacy student ghatkesar, auto driver, another disha case, jodimetla, abduction, attempt rape, Rampalli, Medchal Malkajgiri district, crime, crime news, crime news today, hyderabad crime news today, hyderabad rape victim latest news

Another atrocity took place in Hyderabad. A b. pharmacy student on his way home from college was kidnapped by an auto driver and two others tried to harass him. The girl who was confronted was injured. The incident took place at Ghatkesar police station. Police have taken the incident seriously and are investigating.

కిడ్నాపర్ల నుంచి ఫార్మసీ విద్యార్థినిని కాపాడిన పోలీసులు

Posted: 02/11/2021 11:48 AM IST
Pharmacy student allegedly abducted and raped attempt

కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న బిపార్మసీ విద్యార్థినిన అటో డ్రైవర్ సహా ముగ్గురు కిడ్నాప్ చేయగా, తల్లిదండ్రుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వాయువేగంతో ఘటనాస్థలానికి చేరుకుని విద్యార్థిని రక్షించారు. శంషాబాద్ ప్రాంతంలో చోటుచేసుకున్న దిశ ఘటనను ఇక్కడ పునారావృతం కానీయకుండా సకాలంలో చర్యలు తీసుకున్న పోలీసలు యువతిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంపల్లిలోని ఓ కాలేజీలో ఫార్మసి విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి (19) క్రితం రోజు సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది.

కళాశాల నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చి నిల్చోగా.. ఒక ఆటో రావడంతో అందులో ఎక్కింది. అయితే అప్పటికే అందులో ఓ వృద్ధురాలితో పాటు మరో చిన్న పాప ఉండటంతో తాను కూడా ఎక్కింది. సత్యనారాయణ నగర్‌ వద్దకు రాగానే వృద్ధురాలు, పాప దిగడంతో అటోలో యువతి మాత్రమే వుంది. ఈ లోగా తాను దిగాల్సిన ఆర్‌ఎల్‌ఆర్‌ నగర్‌ స్టాప్‌ వచ్చినా డ్రైవర్‌ ఆటోను ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో యువతి అరవకుండా ఇద్దరు యువకులు అమె నోరు మూసి గట్టిగా పట్టుకున్నారు.

ఆటోను ఘట్ కేసర్‌ మండలం, యంనంపేట వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే వారి నుంచి సమాచారం అందుకున్న ఓ వ్యక్తి అక్కడికి ఒక వ్యాన్ తీసుకురాగా, అందులోనికి యువతిని ఎక్కించారు. ఈ సమయంలో వారు బయట మాట్లాడుతుండగానే యువతి తన తల్లికి ఘటనపై సమాచారం అందించింది. దీంతో అమె తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వెనువెంటనే స్పందించిన పోలీసులు యువతి సెల్ నెంబర్ ను ట్రాక్ చేస్తూ.. ఆటోను వెంబడించారు. యంనంపేట వద్ద ఆటో వుందని అక్కడికి వెళ్లారు. ఈలోగా యువతి ఎవరికో ఫోన్ చేసిందని అమెను చుట్టుముట్టిన నలుగురు అమెపై కర్రలతో దాడి చేశారు.

ఈ లోగా పోలీసులు చేరుకునే సరికి అమెను అక్కడే వదిలేసిన నిందితులు పారిపోయారు. గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రి తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కీసర సీఐ నరేందర్ గౌడ్‌, ఘట్ కేసర్‌ పోలీసులు కలిసి విద్యార్థిని సకాలంలో రక్షించడంలో కిలక పాత్ర పోషించారు. ఘటనపై మల్కాజ్ గిరి డీసిపి రక్షితామూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. సీపీ కెమెరాల ద్వారా ఘటనను విశ్లేషిస్తున్నామని, కిడ్నాప్‌నకు యత్నించింది ఎవరో.. ఎందుకు చేశారో పూర్తి వివరాల కోసం విచారణ జరుపుతున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles