ఉత్తరాది పెళ్లి వేడకల్లో పెళ్లికొడుకు గుర్రంపై ఊరేగుతూ మండపానికి చేరుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే అబ్బాయిలే ఎందుకు.. అమ్మాయిలు ఇలా వస్తే ఎలా వుంటుంది.. అన్న అలోచన నూటికి 99 మంది వధువులకు రాదు. ఇక వచ్చిన ఒక్క శాతం మంది వధువులను వారి కుటుంబసభ్యులు వారించడమో.. నచ్చజెప్పడమో చేస్తుంటారు. కానీ అలాంటి కోరిక తనకు వుందని.. ధైర్యంగా తన తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు వరుడి కుటుంబాన్ని ఒప్పించి.. అలా చేరుకుంది ఈ వధువు. అమె పేరే దీప.
సంప్రదాయానికి భిన్నంగా గుర్రాన్ని ఎక్కి తన బంధుజనమంతా వస్తుండగా.. వారి నడుమ ఊరేగుతూ వచ్చింది దీపా. ఈ భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్ లోని సాట్నా జల్లాలో జరిగింది. అది కూడా పెళ్లిదుస్తుల్లో కాకుండా మోడ్రన్ దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే యువతి వలేచా ఫ్యామిలీలోనే ఏకైక కూతురు. దీంతో చిన్పప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆమె తల్లిదండ్రులు గుర్రంపై స్వారీ చేయాలన్న తమ కూతురి కోరికను కూడా సంతోషంగా నెరవేర్చారు.
అంతేకాకుండా సమాజంలో ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని, అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కూతురిపై అపారమైన ప్రేమతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన వలేచా పేరెంట్స్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పెళ్లిరోజు గుర్రపు స్వారీ చేసుకుంటూ రావాలన్న తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని వధువు దీపా వలేచా పేర్కొంది. కుటుంబసభ్యుల వల్లే తన కోరిక నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more