Demand For Bar Permits In Telangana Goes Up తెలంగాణలో 159 బార్లకు 7,380 దరఖాస్తులు

Demand for bar permits in greater hyderabad goes up

Bar and Restaurant, Bar applications, district collectors, bar license, excise department, Hyderabad, Telangana

Over 7000 odd applications from people seeking licenses to set up bars in Greater Hyderabad is received by the Prohibition and Excise Department. It is estimated that over Rs. 70 crores worth revenue was generated in the form of a non-refundable application fee.

తెలంగాణలో బార్లకు కూడా భలే డిమాండ్.. 159 బార్లకు 7,380 దరఖాస్తులు

Posted: 02/09/2021 08:11 PM IST
Demand for bar permits in greater hyderabad goes up

రాష్ట్రంలోని 72 మునిసిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు జనవరి 25న ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వగా, మొత్తం 7,380 దరఖాస్తులు వచ్చాయి. ఇక పాత బార్లలో తొర్రూరులో ఉండే ఒకే బార్ కు అత్యధికంగా 278 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మునిసిపాలిటీ బార్ అండ్ రెస్టారెంట్ విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. నేరేడుచర్ల మునిసిపాలిటీలో ఒకే ఒక్క బార్ కు పర్మిషన్ ఇవ్వగా, దీన్ని సొంతం చేసుకునేందుకు ఏకంగా 248 దరఖాస్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తు ఫీజుతోనే ఖజానాకు రూ. 73.78 కోట్ల ఆదాయం లభించింది.

రెండు రోజుల క్రితమే దరఖాస్తులకు గడువు ముగియడంతో ఇవాళ  డ్రా ద్వారా బార్లను కేటాయించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్ మునిసిపాలిటీల్లో మాత్రమే బార్ల ఏర్పాటుకు అతి తక్కువ స్పందన కనిపించింది. నిజామాబాద్ లో ఏడు బార్లకుగాను 7, బోధన్ లో మూడు బార్లకు గాను మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 55 బార్లకు గాను 1,074 దరఖాస్తులు వచ్చాయి. పది కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లు 147 ఉన్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో నూతన మునిసిపాలిటీల్లో ఐదు బార్లు నోటిఫై చేయగా, 638 దరఖాస్తులు వచ్చాయి.

ఇక యాదగిరిగుట్ట పరిధిలో ఒకే బార్ ఉండగా, దీనికి 277 మంది పోటీ పడ్డారు. దీంతో ఈ బార్ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ డ్రా అనంతరం గెలిచిన వారికి 17న షాపులను కేటాయించనున్నారు. ఆపై మూడు నెలల్లోగా ఎక్సైజ్ శాఖ సూచించే నిబంధనలను బార్లు పొందిన యజమానులు పూర్తి చేయాల్సి వుంటుంది. జిల్లాల పరిధిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రా జరగింది. ఇదిలావుండగా అటు మద్యం దుకాణాలు, ఇటు బార్లతోనే రాష్ట్రానికి భారీగా అదాయం సమకూర్చుకోవడంపై ఇప్పటికే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles