Wife red handedly caught her Husband and his Mistress కూతరు వయస్సున్న అమ్మాయితో రెండో పెళ్లి.. గుట్టుగా సంసారం..

Wife red handedly caught her husband and his mistress in kamareddy

second marriage, secret marriage, wife caught husband red-handedly, yadadri, kamareddy, parushuram, daughter, kavita, Telangana, crime

A Husband having two daughters and a son married a teen girl of his daughter and secretly married her. After two months his wife doubted him as he was not comming to home. She inquired him and caught him red handedly.

కూతరు వయస్సున్న అమ్మాయితో రెండో పెళ్లి.. గుట్టుగా సంసారం..

Posted: 02/09/2021 10:37 PM IST
Wife red handedly caught her husband and his mistress in kamareddy

తన కూతురు వయస్సున్న అమ్మాయిపై మోజుపడ్డాడు.. అంతే అమెకు మాయమాటలు చెప్పాడు. వలలో వేసుకున్నాడు. జిల్లా కానీ జిల్లాలో అబద్దాల పునాదులపై అమ్మాయిని వివాహం చేసుకుని రహస్యంగా కాపురం పెట్టాడు. ఇకనేం తాను అనుకున్నది జరిగింది. ఇలా సాగినంతకాలం సాగని.. తరువాత సంగతి తరువాత అనుకున్నాడు. అదే సమయంలో తమ భర్త ఇంటికి రావడం లేదని అందోళన చెందిన భార్య.. అసలేం జరగింది.. అంటూ భర్త గురించి విచారించి నిజాలు తెలిసి విస్తుపోయింది.

గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని కామారెడ్డి అశోక్‌నగర్‌ కాలనీలో మకాం పెట్టిన తన భర్తను పట్టుకొని మొదటి భార్య దేహశుద్ది చేసింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్‌వేల్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారంతా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. అయితే వారి నుంచి మూడు నెలల క్రితం వచ్చిన పరుశురాం ఇంటికి మాత్రం రావడం లేదు.

వ్యాపారం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరశురాం గతంలోనూ పలు పర్యాయాలు ఇళ్లు వదిలి పక్షం రోజులు నుంచి నెల రోజుల వరకు వచ్చేవాడు కాదు. అయితే ఈ సారి మాత్రం ఏకంగా మూడు నెలలుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా కామారెడ్డికి చెందిన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడని తెలిసింది. దీంతో సోమవారం బంధువులతో కలిసి వచ్చి, పరశురాంను పట్టుకుని చితకబాది తమ వెంట తీసుకెళ్లారు. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని రెండో భార్య కవిత ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles