Diplomats, employees safe, says Israeli Embassy పేలుడు ముందే ఊహించామన్న ఇజ్రాయిల్ రాయబారి

Envelope addressed to israeli embassy recovered from blast site by cops report

Blast reported near Israel embassy in Delhi, Ron Malka on Delhi blast,Israeli embassy on Delhi blast, Blast reported in Delhi, Blast reported near Israel embassy, bomb blast in Delhi,bomb blast, Isreal embassy, Delhi, Dr. ABJ Abdul kalam Road, Delhi police, Delhi deputy commissioner, Pramod Kushwah, Crime

"The incident is under investigation by the authorities in India who are in contact with the relevant Israeli authorities. Authorities from both sides are cooperating in the investigation. We will continue to update as there are developments," Ron Malka tweeted.

ఢిల్లీ బాంబుపేలుడు: ముందే ఊహించామన్న ఇజ్రాయిల్ రాయబారి

Posted: 01/30/2021 01:21 PM IST
Envelope addressed to israeli embassy recovered from blast site by cops report

దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ ఏబీజే అద్బుల్ కలామ్ రోడ్డులోని ఇజ్రాయిల్ దౌత్యకార్యాలయంపై దాడిలో ఢిల్లీ పోలీసులు పురోగతి సాధించారు. సిసిటీవీ పూటేజీని పరిశీలించిన పోలీసులు పేలుడుకు ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్ లో అక్కడ దిగారని గుర్తించి.. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు,. వీరికి పేలుడుకు ఏమైనా లింక్ వుందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. డ్రైవర్ తెలిపిన వివరాల ఆధారాల వారి ఊహాచిత్రాలను గీయిస్తున్నారు. పేలుడులో అమ్మెనియం నైట్రేట్ ను వినియోగించినట్లు తేలడంలో పెద్ద కుట్రే వుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

బాంబు పేలుడు జరిగిన ఘటనాస్థలికి కొద్దిదూరంలో సగం కాలిన గులాబి రంగు చెన్నీతో పాటు ఓ ఎన్వలప్ ను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్వలప్ లో లో రాయభారిని ఉద్దేశిస్తూ ఓ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇరాన్ గతేడాది మరణించిన అగ్రశ్రేణి కమాండర్ ఖాసి సలేమాని, శాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు వున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజా పేలుడు ఇరాన్ కు సంబంధం వుండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఈ దాడి కేవలం ట్రైయిలర్ మాత్రమేనని కూడా ఆ లేఖలో పేర్కోన్నారని తెలుస్తోంది.

కాగా, ఈ ఘటనలో తమ ఉద్యోగులు, సిబ్బంది, దౌత్యాధికారులు అందరూ సురక్షితంగానే వున్నారని ఇజ్రాయిల్ రాయబారి రోన్ మల్కా తెలిపారు. ఈ బాంబు పేలుడు ఘటన తమకు ఏమాత్రం అశ్చర్యం కలిగించలేదని చెప్పిన ఆయన ఈ ఘటనను ముందే ఊహించామని అన్నారు. ఇది ముమ్మాటికీ ఉద్రవాద దాడేనని పేర్కోన్నారు. భారత్ తో పాటు యావత్ ప్రపంచంలోని అన్ని ఇజ్రాయిల్ ఎంబసీలనూ లక్ష్యం చేసుకున్నారని అన్నారు. ఈ ఘటనపై భఆరత్ తో కలసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. భారత్ తో తమ దేశ ఎంబసీ 29వ వార్సీకోత్సవ రోజున ఉద్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles